https://oktelugu.com/

Sobhita Dhulipala: 66 ఏళ్ళ ముసలాయన తో లిప్ లాక్..హద్దులు దాటుతున్న నాగ చైతన్య లవర్

Sobhita Dhulipala: ఒక్కసారి సినీ రంగం లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని హద్దులు చెరిపేయాల్సి ఉంటుంది, అప్పుడే అనుకున్న గమ్యానికి ఏ నటి అయినా, నటుడైనా చేరుకుంటాడు.చాలా మంది హీరోయిన్స్ తమ పరిధిని దాటకుండా, అందాల ఆరబోతకు ఒప్పుకోకుండా, కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ లో నెగ్గుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మరికొంతమంది హీరోయిన్స్ అయితే పాత్రకి తగ్గట్టుగా డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యడానికి సిద్ధం అయిపోతారు.ఇలాంటి వాళ్లకి టాలెంట్ ఉన్నా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 22, 2023 / 01:26 PM IST
    Follow us on

    Sobhita Dhulipala

    Sobhita Dhulipala: ఒక్కసారి సినీ రంగం లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని హద్దులు చెరిపేయాల్సి ఉంటుంది, అప్పుడే అనుకున్న గమ్యానికి ఏ నటి అయినా, నటుడైనా చేరుకుంటాడు.చాలా మంది హీరోయిన్స్ తమ పరిధిని దాటకుండా, అందాల ఆరబోతకు ఒప్పుకోకుండా, కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు.అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీ లో నెగ్గుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ.

    మరికొంతమంది హీరోయిన్స్ అయితే పాత్రకి తగ్గట్టుగా డైరెక్టర్ ఏది చెప్తే అది చెయ్యడానికి సిద్ధం అయిపోతారు.ఇలాంటి వాళ్లకి టాలెంట్ ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీ లో అవకాశాలు క్యూ కట్టేస్తాయి.అలాంటి హీరోయిన్స్ లో ఒకరే శోభిత దూళిపాళ్ల.మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకున్న ఈ వైజాగ్ బ్యూటీ తెలుగు అడవి శేష్ హీరో గా నటించిన గూడాచారి, మేజర్ వంటి చిత్రాల్లో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె , ఇప్పుడు ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

    రీసెంట్ గా ఆమె ‘ది నైట్ మేనేజర్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించింది.దీనికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేసారు.ఇందులో ఆమె 66 ఏళ్ళ వయసున్న అనిల్ కపూర్ తో లిప్ లాక్ సన్నివేశం లో నటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.అసలు ఇలాంటి సన్నివేశాల్లో మన తెలుగు అమ్మాయి నటించడానికి ఎలా మనసొచ్చింది అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.పాత్ర కోసం కమిట్మెంట్ తో ఉండడం లో తప్పులేదు కానీ, ఇలా ఒక వయస్సుతో సంబంధం లేకుండా హద్దులు దాటి ప్రవర్తించడం ఏమిటని విమర్శిస్తున్నారు.అయితే శోభిత దూళిపాళ్ల కి సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు, ఈ క్రమం లో డైరెక్టర్స్ ఏది చెప్తే అది చేస్తాను అని సంకేతం ఇవ్వడానికే ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తుంది అని కొంతమంది అంటున్నారు.

    Sobhita Dhulipala

    ఇది ఇలా ఉండగా ఈమె ప్రముఖ హీరో నాగ చైతన్య తో డేటింగ్ లో ఉంది అనే వార్త గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న సంగతి తెల్సిందే.ఒకవేళ ఇదే నిజమైతే నాగ చైతన్య ఆమెని ఇలాంటి సన్నివేశాల్లో నటించేందుకు ఎందుకు అనుమతిని ఇచ్చాడంటూ ప్రశ్నిస్తున్నారు.

     

    Tags