K.Vishwanath : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి గర్వకారణం..ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎంతటి వారికైనా మనసు పులకరించిపోతుంది.. అంత గొప్ప మేలిమి ముత్యాలు లాంటి సినిమాలు తీసిన కె విశ్వనాథ్ గారు నేడు మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు ప్రయాణం అవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టేసింది.. ఆయన లేని లోటు ఎవ్వరు పూడవలేనిది.. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడు కూడా.
స్వాతి ముత్యం, సాగర సంగమం, శంకరాభరణం, స్వయం కృషి , శుభ లేఖ ఇలా ఒక్కటా రెండా..ఆయన తీసినన్ని ఆల్ టైం క్లాసిక్ చిత్రాలను బహుశా ఇండియాలో ఎవ్వరూ కూడా తీసి ఉండరు. టాలీవుడ్ కిరీటంలో వజ్రం లాంటి ఆ మహానుభావుడు నేడు మన మధ్య లేడు అనే విషయాన్నీ జీర్ణించుకోడానికి చాలాకష్టం అవుతుంది.. అయితే విశ్వనాథ్ గారు చనిపోవడానికి గల ముఖ్యమైన కారణాలను డాక్టర్లు వివరిస్తూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విశ్వనాథ్ గారు గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.. శ్వాసకి సంబంధించి ఆయన పడుతున్న ఇబ్బందిని గమనించిన కుటుంబ సభ్యులు, ఆయనని అపోలో హాస్పిటల్స్ లో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు..అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఉపాసన విశ్వనాథ్ గారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకునేది..కానీ దేవుడు రాసిన తలరాతని ఎవ్వరూ మార్చలేరు..అందుకే విశ్వనాథ్ ఎంతమంది స్పెషలిస్టులు ఆయన ఆరోగ్యం మెరుగుపడడానికి ప్రయత్నం చేసిన కాపాడలేకపొయ్యారు.
విశ్వనాథ్ గారిని రక్షించుకునేందుకు మా శక్తి మొత్తం ఉపయోగించామని.. కానీ దురదృష్టం కొద్ది ఆయనని కాపాడలేకపోయామని డాక్టర్లు ఈ సందర్భంగా తెలిపారు.. విశ్వనాథ్ గారికి శ్వాసకి సంబంధించి చాలా కాలం నుండి ఇబ్బంది పడుతున్నాడని.. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో ఆయనని ఎమర్జెన్సీ వార్డు కి తరలించి అత్యవసర చికిత్స అందించామని..పెద్ద వయసు కాబట్టి ఆయన చికిత్స కి సరిగా స్పందించక పోవడం తో ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు డాక్టర్లు.