Homeట్రెండింగ్ న్యూస్Stray Dog Attack: ఆ యువతి అంత ధైర్యమా... యువకుడిని కాపాడింది!

Stray Dog Attack: ఆ యువతి అంత ధైర్యమా… యువకుడిని కాపాడింది!

Stray Dog Attack: అరిచే కుక్క కరవదు అంటారు.. కానీ, ఇది నానుడి మాత్రమే.. అరిచే కుక్క కరవదన్న గ్యారంటీ లేదు. కరవాలి అనుకుంటే.. కరిచేస్తుంది. షాపు నించి బయటకు వచ్చిన ఓ యువకుడిపై సడెన్‌గా కుక్క దాడి చేసింది. కండ పట్టేసింది. అతడు లబోదిబో మని మొత్తుకుంటున్నాడు. ఎంత ప్రయత్నించినా వదల్లేదు. అది చూసిన ఓ యువతి పరుగున వచ్చి కుక్కను పట్టుకుని బలంగా లాగేసింది. కుక్క తనను కరిచే ప్రమాదం ఉందని తెలిసినా భయపడకుండా సాహసం చేసింది. యువకుడిని కాపాడింది. ఈ క్రమంలో ఆ కుక్క యువతి చేతులను కూడా కొరికింది. ఇంతలో స్థానికులు రావండంతో కుక్క పారిపోయింది.

ఏం జరిగిందంటే…
చాలా మంది వీధికుక్కలకే కాదు.. పెంపుడు కుక్కలకు కూడా చాలా మంది టీకా వేయించరు. అలాంటి కుక్కలు కరిస్తే రేబిస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఇక ఎండాకాలంలో కుక్కలకు తిక్క పెరుగుతుంది. దీంతో కారణం లేకుండానే మనుషులపై, ఆవులు, గేదెలపై దాడిచేస్తుంటాయి. ప్రస్తుతం చలి తగ్గి ఎండ పెరుగుతోంది. దీంతో కుక్కలకు వేడికి చిర్రెత్తుకొస్తోంది. ఈ సమయంలో కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైదుఉ్యలు సూచిస్తున్నారు.

కుక్కలకు దూరంగా ఉండాలి..
కుక్కలు ఈ సమయంలో ఆగ్రహంతో ఉంటాయి. వాటివైపు వెళితే అవి తమను ఏదైనా చేయడానికి వస్తున్నారని భావిస్తాయి. దీంతో దాడిచేసే ప్రమాదం ఉంటుంది. అందుకే కుక్కలకు దూరంగా ఉండడం చాలా మంచిది. కారణం లేకుండా కుక్కలను కొట్టడానికి కూడా వెళ్లొద్దు. ప్రయత్నం చేయొద్దు.

చిన్న పిల్లలు జాగ్రత్త..
ఇక చిన్న పిల్లల విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గతంలో చిన్నపిల్లలపై కుక్కలు దాడిచేసి చంపేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కుక్కలు దాడులు చేసే సీజన్‌. ఈ నేపథ్యంలో పిల్లలను ఒంటరిగా బయటకు పంపకపోవడం చాలా మంచిది. లేదంటే దాడిచేసే ప్రమాదం ఉంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular