Kushi Re Release collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఇండస్ట్రీ హిట్ చిత్రం ఖుషి నేడు ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో భారీ లెవెల్ లో విడుదలైంది..రెండు దశాబ్దాల క్రితం విడుదలైన సినిమా కదా, పైగా ఎలాంటి విశేషమైన సందర్భం కూడా లేదు..కలెక్షన్స్ రావు..ఫ్లాప్ అవ్వుద్ది..వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ప్లాన్ చేస్తే బాగుండేది అంటూ అభిమానులు మెగా సూర్య ప్రొడక్షన్స్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో అడిగేవాళ్ళు..కానీ ఎప్పుడైతే ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారో, ఖుషి మేనియా ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయింది.

టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి..రోజురోజుకి ఈ సినిమాకి పెరుగుతున్న డిమాండ్ ని గమనించిన డిస్ట్రిబ్యూటర్స్ షోస్ యాడ్ చేసుకుంటూ వెళ్లారు..అలా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కళ్ళు చెదిరే రేంజ్ లో వచ్చింది..ఇక ఈరోజు ఈ సినిమా ఇండియా లో ప్రస్తుతం ఆడుతున్న సినిమాల గ్రాస్ ని క్రాస్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘అవతార్ 2 ‘ మేనియా నడుస్తుంది..ఈ సినిమా ఈరోజు కలెక్షన్స్ ని ఖుషి అధిగమించి ఇండియాలోనే అత్యధిక గ్రాస్ సాధించిన సినిమా గా నెంబర్ 1 స్థానం లో నిలిచింది..అవతార్ 2 చిత్రానికి అన్ని భాషలు కలిపి కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

కానీ ఖుషి చిత్రానికి ఏకంగా మూడు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది ఒక అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు..కొత్త సినిమాని పక్కకి నెట్టి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యి డామినేట్ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు..పవన్ కళ్యాణ్ క్రేజ్ కి ఇదొక నిదర్శనం గా చెప్పుకోవచ్చు..ఒక వ్యక్తిని ఇంతలా మన ఆంధ్ర ప్రజలు ఆదరించేది ఒక్క పవన్ కళ్యాణ్ ని మాత్రమే అని మరోసారి నిరూపితమైంది.