Chiranjeevi Pawan Kalyan మెగాస్టార్ చిరంజీవి అందరివాడు. ఆయన తన కుటుంబం, సినీ ఇండస్ట్రీ కోసం ఎంతో చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన మనసులోని బాధను వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని చిరంజీవి ప్రస్తావించడం అందరినీ ఆలోచింపచేసింది. పవన్ కల్యాణ్ కు తామంటే ఎంత ప్రేమనో చిరంజీవి వెల్లడించారు. పవన్ కల్యాణ్ మనసులోని కోరిక ఏంటో చిరంజీవి బయటపెట్టారు.

పవన్ కళ్యాన్ గురించిన ఆసక్తికర విషయాలను చిరంజీవి వెల్లడించారు. పవన్ తనకు బిడ్డలాంటి తమ్ముడు అని చెప్పుకొచ్చాడు. పవన్ నుతన చేతులతో ఎత్తుకొని పెంచానని.. తాను, తన సతీమణి సురేఖ పవన్ కు తల్లిదండ్రులలాంటి వాళ్లమని పేర్కొన్నారు. పవన్ కు తామంటే అంతే ప్రేమ అని వివరించారు.
పవన్ కళ్యాణ్ లో కించిత్ స్వార్థం.. డబ్బు యావ, పదవీకాంక్ష లేదని విశ్లేషించారు. తన కోసం ఎప్పుడూ ఆలోచన చేయరని పేర్కొన్నారు. తన అన్నగా కాకుండా పవన్ కు దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ విషయం చెబుతున్నట్టు చిరంజీవి పేర్కొన్నారు.
పవన్ ను తిట్టినవాళ్లు తన వద్దకు వచ్చి పెళ్లిళ్లు, పేరంటాలకు పిలుస్తారని.. రమ్మని బతిమిలాడుతారని.. కానీ తన తమ్ముడిని అన్ని మాటలుఅన్నవాళ్లతో మాట్లాడాల్సి వస్తుందని.. కలవాల్సి వస్తుందనే బాధ ఉంటుందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలేసిన యోగిలాంటి వాడు పవన్ అంటూ చిరంజీవి తన తమ్ముడిని ఆకాశానికెత్తేశఆడు. వేళకు అన్నం తినడు.. బట్టలు వేసుకోడని.. పవన్ కుసొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. పవన్ గురించి చిరంజీవి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.