Homeఎంటర్టైన్మెంట్YouTube - Kurchi Madathapetti Song : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న కుర్చీ మడతపెట్టి...

YouTube – Kurchi Madathapetti Song : యూట్యూబ్ ని షేక్ చేస్తున్న కుర్చీ మడతపెట్టి సాంగ్… మహేష్ మాస్ జాతరకు ఊహించని రెస్పాన్స్

YouTube – Kurchi Madathapetti Song : మహేష్ బాబు స్టార్ డమ్ కి గుంటూరు కారం మూవీ రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం రికార్డు వసూళ్లు రాబడుతుంది. రూ. 200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లకు దగ్గరయింది. గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదలైంది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన హనుమాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే నాగార్జున నటించిన నా సామిరంగ సైతం పాజిటివ్ టాక్ తో గుంటూరు కారం చిత్రానికి ఒకింత పోటీ ఇచ్చింది. కాంపిటీషన్ ఉన్నప్పటికి మహేష్ మేనియాతో పాటు పండగ సెలవులు కలిసొచ్చాయి.

గుంటూరు కారం మూవీ కథ, కథనం బాగోలేదనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం. దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్టర్ గా విఫలం చెందాడు. ఆయన మార్క్ మిస్ అయ్యిందని విమర్శకుల వాదన. అయితే మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, మాస్ మేనరిజం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. బీడీ తాగుతూ మహేష్ ఊర మాస్ రోల్ చేశాడు.

పాత్రకు తగ్గట్లు ఈ సినిమాలో రెండు మాస్ బీట్స్ ఉన్నాయి. వాటిలో కుర్చీ మడతపెట్టి సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కింది. శ్రీలీల-మహేష్ మీద తెరకెక్కిన ఆ సాంగ్ థియేటర్స్ దద్దరిల్లేలా చేసింది. మహేష్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎనర్జిటిక్ స్టెప్స్ తో దుమ్మురేపాడు. శ్రీలీలకు గట్టి పోటీ ఇచ్చాడు. కాగా కుర్చీ మడతపెట్టి సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. మ్యూజిక్ విభాగంలో నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతుంది.

కుర్చీ మడతపెట్టి సాంగ్ అతి తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఇదో రికార్డు అని చెప్పాలి. సాంగ్ విడుదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా ట్రెండ్ అవుతుంది. థమన్ స్వరపరిచిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. సోషల్ మీడియా స్టార్ కుర్చీ తాత చెప్పిన ‘కుర్చీ మడతపెట్టి’ డైలాగ్ ని సాంగ్ లో వాడటం కొసమెరుపు. ఆ డైలాగ్ సాంగ్ కి మరింత మాస్ అప్పీల్ వచ్చేలా చేసింది.

 

RELATED ARTICLES

Most Popular