Kriti Shetty : రెండు పదుల వయసు నిండకుండానే ఇండస్ట్రీని షేక్ చేసింది కృతి శెట్టి. లక్కీ లేడీ ట్యాగ్ సొంతం చేసుకున్న రేర్ బ్యూటీ. చేసింది తక్కువ చిత్రాలే అయినప్పటికీ ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసింది. ముఖ్యంగా యూత్ లో భారీ ఫాలోయింగ్ రాబట్టింది. ఉప్పెన, బంగార్రాజు చిత్రాల్లో కృతి చేసిన పాత్రలు ఆడియన్స్ కి గుర్తుండి పోతాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు… ఉప్పెన బ్లాక్ బస్టర్ కావడం కృతికి బాగా ప్లస్ అయ్యింది. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీలో కీర్తి నటన మనసులు దోచేసింది. కాలేజ్ గర్ల్ గా ఆమె గ్లామర్ గిలిగింతలు పెట్టింది.
అరంగేట్రంలోనే బోల్డ్ సీన్స్ లో నటించిన ఘనత కృతి సొంతం. ఉప్పెన మూవీలో ”జలజలపాతం” సాంగ్ లో కృతి కొంచెం హద్దులు మీరి శృంగారం పండించారు. శ్యామ్ సింగరాయ్ లో కూడా ఆమె నానితో బెడ్ రూమ్ సన్నివేశం చేయడం విశేషం. ఇక ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో కృతి హ్యాట్రిక్ పూర్తి చేసింది. ఇది రేట్ ఫీట్ అని చెప్పొచ్చు. అయితే ఆమెకు మరో మూడు ప్లాప్స్ వరుసగా పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కృతికి ఝలక్ ఇచ్చాయి.
దీంతో ఒక్కసారిగా తెలుగులో ఆఫర్స్ తగ్గాయి. ప్రస్తుతం కృతి చేతిలో ఉన్న ఒకే ఒక తెలుగు చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. గత చిత్రాలకు భిన్నంగా సీరియస్ సోషల్ కంటెంట్ తో తెరకెక్కుతుంది. కృతి ఓ ఇంటెన్స్ రోల్ చేస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్స్ ఆసక్తి పెంచేస్తున్నారు. కృతి-చైతూలది హిట్ కాంబినేషన్ కావడంతో పాజిటివ్ బజ్ ఉంది.
అలాగే ఇటీవల ఓ మలయాళ చిత్రానికి సైన్ చేసింది. ఆమెకు ఫస్ట్ మలయాళ చిత్రం ఇది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ని పలకరిస్తున్నారు. తాజాగా రెడ్ రోజ్ ని ముద్దాడుతూ ఫోటో షూట్ చేసింది. కృతి పెదాలు తాకిన రోజా మరింత ఎరుపెక్కిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లోజప్ షాట్ లో కృతి గ్లామర్ మెస్మరైజ్ చేస్తుంది. కృతి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఈ ఏడాది కృతికి కీలకం కాగా.. ఆమెను సక్సెస్ పలకరిస్తుందో లేదో చూడాలి.