Krishnam Raju Marriages : కృష్ణంరాజుది రెండో పెళ్లా? మొదటి భార్య ఎవరు? ఏంటా స్టోరీ?

Krishnam Raju Marriages  టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు సినిమాపై ఇష్టంతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు 187 చిత్రాల్లో ఇప్పటివరకూ నటించిన కృష్ణంరాజు చివరగా ప్రభాస్ తోనే ‘రాధేశ్యామ్’లో నటించారు తన తమ్ముడు కుమారుడు ‘ప్రభాస్’ను నటవారసుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసి […]

Written By: NARESH, Updated On : September 11, 2022 8:19 pm
Follow us on

Krishnam Raju Marriages  టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు సినిమాపై ఇష్టంతో మద్రాసు వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దాదాపు 187 చిత్రాల్లో ఇప్పటివరకూ నటించిన కృష్ణంరాజు చివరగా ప్రభాస్ తోనే ‘రాధేశ్యామ్’లో నటించారు

తన తమ్ముడు కుమారుడు ‘ప్రభాస్’ను నటవారసుడిగా టాలీవుడ్ కు పరిచయం చేసి అతడి కెరీర్ ను తీర్చిదిద్దాడు. ప్రభాస్ ప్యాన్ ఇండియాస్టార్ గా ఎదగడంలో కృష్ణంరాజు పాత్ర ఎంతో ఉంది.

ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. ఆయనకు ఇద్దరు భార్యలు అన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు. కృష్ణంరాజు ముందుగా సీతాదేవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కృష్ణంరాజు-సీతాదేవి దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే కృష్ణంరాజు భార్య సీతాదేవి ఒక రోడ్డు ప్రమాదంలో 1995లో మృతిచెందారు. ఆమె మరణం తర్వాత కృష్ణంరాజు ‘శ్యామలాదేవి’ అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.

కృష్ణంరాజు-శ్యామలాదేవి దంపతులకు మరో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరి ముగ్గురితోపాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. ప్రభాస్ ను కూడా సొంత కొడుకుగా చూసుకుంటారు.