Krishna- Murali Mohan: సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆయన ఉన్న బంధాలను సినీ నటులు నెమరేసుకుంటున్నారు. లేటేస్టుగా కృష్ణ గురించి సీనియర్ నటుడు మురళీ మోహన్ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. కృష్ణ ఇంటర్ ఫెయిల్ అయ్యాడని చిన్ననాటి విషయాలు చెప్పారు. అయితే కృష్ణ, మురళీ మోహన్ లు చిత్ర పరిశ్రమలోకి రాకముందే స్నేహితులు. వీరిద్దరు కలిసి ఒకే కళాశాలలో చదువుకున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సర్ ప్రైజ్ ఇచ్చారు. తనతో చిన్నప్పుడు కలిసున్న స్నేహితుడు ఇప్పుడు లేకపోవడం బాధాకరమని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలేంటంటే..?

కృష్ణ కళాశాల చదువుల కోసం బుర్రిపాలెం నుంచి ఏలూరు కి వచ్చేవారు. అక్కడ హాస్టల్ లో కాకుండా ప్రత్యేక రూం తీసుకొని అందులో కృష్ణతో కలిసి ఉన్నామని మురళీ మోహన్ తెలిపారు. ఆ సందర్భంలో అతన్ని ‘కృష్ణ మూర్తి’ అని పిలిచామన్నారు. రోజూ సమాజం మీద జరిగే విషయాలను ఒకరికొకరం చెప్పుకునేవాళ్లమన్నారు. ప్రతీ పండక్కి కృష్ణ తమ ఇంటికి వచ్చారని మురళీ మోహన్ గుర్తు తెచ్చుకున్నారు. తమది మొత్తం 66 ఏళ్ల స్నేహమని ఇంకా మా మధ్య మరిచిపోలేని అనేక విషయాలు చాలా ఉన్నాయని మురళీ మోహన్ అన్నారు.
తాను, కృష్ణ కళాశాలలోని ఫ్రంట్ బెంచీలో కూర్చేనేవాళ్లమని, అయితే ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యామని అన్నారు. ఆ తరువాత ఎలాగోలా కష్టపడి డిగ్రీ పూర్తి చేశామన్నారు. కృష్ణకు సిగ్గు ఎక్కువ అని, ఎక్కువగా ఎవరితో మాట్లాడేవారు కాదని తెలిపారు. ఇక కృష్ణ సినిమాల్లోకి వస్తున్నవిషయం నాకు.. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టేవరకు కృష్ణకు తెలియలేదన్నారు. కృష్ణ సినిమాల కోసం చెన్నై వెళ్లారని, తాను వ్యాపారం కోసం కోయంబత్తూరు వెళ్లామన్నారు. కోయంబత్తూర్ నుంచి వచ్చేటప్పుడు కృష్ణను కలిసి వచ్చేవాడినని తెలిపారు.

దాసరి నారాయణరావు తీసిన ఓ చిత్రంలో కృష్ణ నటించారు. ఇందులో నేను గెస్ట్ రోల్ చేశాను. అయితే అనుకోకుండా మేమిద్దరం కలిశాం. అప్పుడు నువ్వేం చేస్తున్నావ్ అని అడగ్గా.. సినిమాలు చేస్తున్నానని చెప్పడంతో కృష్ణ ఆశ్చర్యపోయాడని అన్నారు. ఆ తరువాత మళ్లీ మేమిద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని చెప్పారు. కృష్ణ లేడన్న విషయం తెలియగానే ఒక్కసారి పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయని మురళీ మోహన్ అన్నారు.