
Kota Srinivasa Rao: సోషల్ మీడియా ప్రచారంలో ఎంత నిజం ఉంటుందో చెప్పేందుకు తాజా ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును కొందరు బ్రతికుండగానే చంపేశారు. నేడు ఉదయం ఈ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేసింది. నిజమే అని నమ్మిన కొందరు ఆయనకు శ్రద్ధాంజలి ప్రకటించడం మొదలుపెట్టారు. కోటా శ్రీనివాసరావుకు వందల ఫోన్ కాల్స్ వెళ్లాయట. దాంతో ఆయన స్వయంగా నేను బ్రతికే ఉన్నాను మహా ప్రభో అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోటా శ్రీనివాసరావు కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. 75 ఏళ్ళ కోటా శ్రీనివాసరావుకు సినిమా ఆఫర్స్ కూడా తగ్గాయి. శరీరం సహకరించపోవడంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా లేకున్నా సినిమాలు చేయాలని ఆసక్తి చూపుతున్నారు. తనకు బాగా పరిచయం ఉన్న దర్శకులను, హీరోలను ఆఫర్స్ కోసం వేడుకుంటున్నానని ఆయన గతంలో చెప్పారు.
ఇదిలా ఉంటే నేడు ఉదయం సోషల్ మీడియాలో కోటా కన్నుమూశారంటూ పోస్ట్స్ దర్శనమిచ్చాయి. ఒకరిని చూసి మరొకరు పదుల సంఖ్యలో కోటా మరణాన్ని ధృవీకరిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టారు. దాంతో సన్నిహితులు కోటాకు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. తాను మరణించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని తెలుసుకున్న కోటా వీడియో విడుదల చేశారు. పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

కోటా మాట్లాడుతూ… నేను కుటుంబ సభ్యులతో రేపటి ఉగాది పండగ గురించి మాట్లాడతాను. ఇంతలో ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. నేనే ఒక యాభై ఫోన్లు మాట్లాడాను. మా కుటుంబ సభ్యులకు కూడా ఫోన్స్ వచ్చాయి. కాసేపటికి పోలీసు వ్యాన్ వచ్చి ఇంటి ముందు ఆగింది. బందోబస్తు కోసం ఓ పది మంది పోలీసులు దిగారు. మా ఇంట్లోకి వచ్చి నన్ను చూసి షాక్ అయ్యారు. ఏంటి సార్ ఇది అంటూ నన్ను ప్రశ్నించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వాళ్ళను మీరే మందలించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పాను. ప్రపంచంలో డబ్బులు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మరీ ఇలాంటి నీచమైన పనులకు దిగవద్దు. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను… అని వివరణ ఇచ్చారు.
Legendary Actor #KotaSrinivasaRao garu confirmed visually that he is absolutely fine. Do not believe in any rumours. 🙏#Tollywood #Rumours pic.twitter.com/7Rs0q6CeEX
— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) March 21, 2023