Koratala Siva- Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మాయని మచ్చగా మిగిలిపోయిన చిత్రం ‘ఆచార్య’..కొరటాల శివ దర్శకత్వం లో గత ఏడాది విడుదలైన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..ఈ సినిమాలో ఆయనతో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యపాత్ర ని పోషించాడు..#RRR సినిమా తర్వాత పాన్ వరల్డ్ రేంజ్ గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్ కి తదుపరి చిత్రం ఇంత పెద్ద ఫ్లాప్ అవ్వడం కేవలం మెగా అభిమానులే కాదు, మెగాస్టార్ చిరంజీవి కూడా జీర్ణించుకోలేకపోయాడు.

ఆ బాధ ఆయన ప్రతీ స్పీచ్ లోను తెలుస్తుంది..అనుభవం తో మేము ఇచ్చే ఇన్ పుట్స్ తీసుకుంటే మంచి ఔట్పుట్స్ వస్తాయి..అలా కాకుండా మా మాటలను లెక్క చెయ్యకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయంటూ పరోక్షంగా ‘గాడ్ ఫాథర్’ , ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో చిరంజీవి కొరటాల శివ పై విరుచుకుపడ్డారు.
కానీ కొరటాల శివ మాత్రం ఇప్పటి వరకు ఆచార్య ఫలితం పై ఎలాంటి కామెంట్ చెయ్యలేదు..పైగా రీసెంట్ గా విడుదలైన మెగాస్టార్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చూసి డైరెక్టర్ బాబీ కి ఫోన్ చేసి గంటసేపటి వరకు మాట్లాడాడంట..’చిరంజీవి గారిని అద్భుతంగా చూపించావు’ అంటూ కొరటాల శివ బాబీని పొగడ్తలతో ముంచెత్తారట..అంతే కాదు రవితేజ పాత్ర డిజైన్ చేసినప్పుడు ముందుగా కొరటాల శివ కే చెప్పాడట బాబీ..చాలా బాగుంది.

ఇలాగే డిజైన్ చెయ్యి అని బాబీ ని ప్రోత్సహించాడట కూడా..ఈరోజు రవితేజ చిరంజీవి మధ్య వచ్చిన సన్నివేశాలకు ఎంత అద్భుతమైన రెస్పాన్స్ లభించిందో మన అందరం చూసాము..దీనికి ఎంతోకొంత కాస్త కొరటాల శివ కి కూడా క్రెడిట్ ఇవ్వొచ్చు..బాబీ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాతైనా కొరటాల శివ పై మెగా ఫ్యాన్స్ కోపం తగ్గించుకుంటారో లేదో చూడాలి.