Koratala Siva- NTR: కొరటాల శివ ఇమేజ్ ని భారీగా డామేజ్ చేసింది ఆచార్య. దర్శకత్వంతో పాటు అనవసర విషయాల్లో తలదూర్చి సినిమాను కిచిడీ చేశారు. ఆచార్య వలన అధికంగా నష్టపోయింది కూడానే కొరటాలనే. చిరంజీవి-రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీ కావడంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇక కొరటాల శివకు పరాజయం ఎరుగని దర్శకుడిగా పేరుంది. మొత్తంగా కాంబోపై అంచనాలు ఆకాశానికి చేరాయి. కానీ వాటిని అందుకోవడంలో కొరటాల పూర్తిగా ఫెయిల్ అయ్యారు. కథ, కథనాలు, టేకింగ్… ఇలా అన్ని విభాగాల్లో ఆచార్య నిరాశపరిచింది.

భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో బయ్యర్లకు నష్టాలు తలెత్తాయి. నష్టాలు కొంత మేర భర్తీ చేయాలని బయ్యర్లు పట్టుబట్టారు. చిరంజీవి, రామ్ చరణ్ తమ రెమ్యూనరేషన్స్ తో పాటు పెద్ద మొత్తం వదిలేశారు. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో తలదూర్చిన కొరటాల శివ బుక్ అయ్యాడు. ఆయన రెమ్యూనరేషన్స్ కి బదులు కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నట్లు సమాచారం. ఆచార్య పరాజయం కావడంతో ఆయన సొంత డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. కూడబెట్టిన ఆస్తులు కూడా అమ్మి బయ్యర్లకు సెటిల్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ అనుభవాల రీత్యా కొరటాల ఎన్టీఆర్ 30 నిర్మాణం, బిజినెస్ జోలికి పోకూడదని ఫిక్స్ అయ్యాడట. కేవలం తన రెమ్యునరేషన్ తీసుకొని పూర్తి ఫోకస్ సినిమాపై పెట్టాలని డిసైడ్ అయ్యాడట. ఎన్టీఆర్ 30 ఆర్థిక విషయాలతో లింక్ పెట్టుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడని సమాచారం. అందులోనూ ఎన్టీఆర్ 30 విజయం ఆయనకు చాలా కీలకం. ఈ మూవీతో కచ్చితంగా సక్సెస్ కొట్టాల్సిన పరిస్థితి. నెక్స్ట్ మరో స్టార్ హీరో ఆఫర్ ఇవ్వాలంటే ఎన్టీఆర్ 30 హిట్ కావాలి.

ఇక చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూట్ కి సిద్ధం అవుతుంది. ఈ నెలలో పూజా కార్యక్రమాలు జరిపి, ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5 విడుదల తేదీగా ప్రకటించారు. చిత్ర హీరోయిన్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. జాన్వీ కపూర్ నటిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ 30కి సీక్వెల్ కూడా ఉంటుందన్న ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.