RRR Los Angeles Special Show: గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన #RRR చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సినిమాకి రాని రికార్డు అంటూ ఏదైనా మిగిలి ఉందా అని చేతి వేళ్ళతో లెక్కపెట్టుకునే రేంజ్ అద్భుతాలను సృష్టించింది ఈ చిత్రం..బాక్స్ ఆఫీస్ పరంగా 1200 కోట్ల రూపాయిలు వసూలు చేసిన ఈ చిత్రానికి డిజిటల్ మీడియా లో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ముఖ్యంగా విదేశీయులు ఈ సినిమా చూడడానికి ఎగబడినట్టు ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా జరగలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు..ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించడంతో ఆస్కార్ అవార్డ్స్ కి కూడా నామినేట్ అవ్వడానికి సిద్ధం గా ఉంది..ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ , లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు ఇలా ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్ అందుకొని ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలతో పోటీగా నిలిచింది.
విదేశాల్లో ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ ఉందొ ఇప్పుడు మేము మీకు ఒక ఉదాహరణ చెప్పబోతున్నాము..ఈ చిత్రం రన్ అమెరికా లో పూర్తి అయిన తర్వాత అక్కడ వివిధ సందర్భాల్లో ఈ సినిమాని 350 సార్లు ప్రదర్శించారు..అలా ప్రదర్శించిన ప్రతీసారి ఈ చిత్రం హౌస్ ఫుల్ కాలేషన్స్ ని నమోదు చేసుకుంది..ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం మరో సంచలనాత్మక రికార్డుని నెలకొల్పింది..ఇక అసలు విషయానికి ప్రపంచం లోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్ లాస్ ఏంజిల్స్ లో ఉంది..ఆ థియేటర్ పేరు ‘TSL చైనీస్ థియేటర్’..అక్కడ ఇటీవలే #RRR చిత్రాన్ని జనవరి 9 వ తేదీన విడుదల చేయబోతున్నారట..దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు ప్రారంభించారు.

అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన 98 సెకండ్స్ లోనే వెయ్యి టిక్కెట్లు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయిందట..ఇది ప్రపంచ రికార్డు అని విశ్లేషకులు చెప్తున్నమాట..ఈ షో కి వెళ్తుంది అమెరికా లో స్థిరపడిన భారతీయులు అనుకుంటే పొరపాటే..వీళ్ళు పూర్తిగా అమెరికాకి చెందిన సిటిజన్స్..ఇలా ఫారనేర్స్ ఈ సినిమాని చూడడానికి క్యూలు కట్టడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది.