Kohinoor Diamond: మన దేశ ఔన్నత్యాన్నిపెంచే కోహినూర్ వజ్రం బ్రిటిష్ వారు అక్రమంగా దోచుకెళ్లారు.దీంతో మన వారు చాలా ఏళ్లుగా దాని గురించి చర్చలు జరిపారు. పోరాటాలు చేశారు. కానీ దాన్ని దేశానికి మాత్రం తీసుకురాలేకపోయారు. మన దేశానికి మకుటాయమానంగా ఉన్న కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ లో ఉంది. దాన్ని రాణి ఎలిజబెత్ మరణం తరువాత కాబోయే రాణి ధరిస్తారనే వాదనలు వస్తున్నాయి. కానీ మన సంపదను దోచుకెళ్లిన వారి నుంచి దాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయాలని చాలా మంది భావిస్తున్నారు.

మన దేశ సంపదను దోచుకెళ్లే హక్కు వారికి ఎక్కడుంది. అది మన సొంతం. మన దర్పణం. మన కీర్తికిరీటంలో కలికితురాయి. మన దేశ ఔన్నత్యానికి ప్రతీక. అలాంటి వజ్రాన్ని బ్రిటిష్ అక్రమంగా వారి దేశానికి తీసుకెళ్లడమే వివాదాస్పదంగా మారింది. దీంతో దాన్ని వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేయాల్సిన సమయం వచ్చింది. బ్రిటిష్ వారి నుంచి మనం మన వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని యావత్ దేశ ప్రజలు ఆశిస్తున్నారు. కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం అప్పుడు ఆంగ్లేయులు తీసుకెళ్లారు.
కోహినూర్ వజ్రం ఒడిశాలోని పూరీ జగన్నాథుడికి చెందింది. దాన్ని అప్పటి మహారాజు నుంచి బ్రిటిష్ అక్రమంగా తీసుకుపోయారు. ఒడిశాకు చెందిన చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్ రాజు రంజిత్ సింగ్ స్వామికి వజ్రాన్ని కానుకగా ఇస్తారని వాదిస్తున్నారు. దీనిపై పూరీ జగన్నాథ సేన అధ్యక్షుడు, న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కోహినూర్ పై అంతర్జాతీయ కోర్టుకు వెళతామని తెలిపారు. కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి అక్టోబర్ 2016లో యునైటెడ్ కింగ్ డమ్ ప్రభుత్వానికి అప్పీల్ చేశారు దీంతో మెజెస్టి సలహా మేరకు వ్యవహరిస్తామని సమాధానం వచ్చింది. 1839లో రంజిత్ సింగ్ మరణించాక పదేళ్ల తరువాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ నుంచి బ్రిటిషర్లు కోహినూర్ వజ్రాన్ని లాగేసుకున్నారు. రంజిత్ సింగ్ వారసులు పాక్, అఫ్గనిస్తాన్ లలో అనేక మంది హక్కుదారులున్నా వారిని సమర్థించరని తెలుస్తోంది. వజ్రాన్ని లాహోర్ మహారాజు ఇంగ్లండ్ రాణికి 170 ఏళ్ల కిందట అప్పగించలేదని తెలిసింది. రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు చార్లెస్ రాజు కాగా చార్లెస్ భార్య కార్న్ వాల్ కెమిల్లా వజ్రాన్ని ధరించనున్నట్లు చెబుతున్నారు.