https://oktelugu.com/

Koffee With Karan 7: కాఫీ విత్ కరణ్ షోలో నాగచైతన్యతో విడాకులపై సంచలన విషయాలు పంచుకున్న సమంత

Koffee With Karan 7: Samantha opens up on divorce with Naga Chaitanya :  దేశంలోని సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితాల్లోని లోతులను బయటకు లాగి జనాలకు మసాలా ఎంటర్ టైన్ మెంట్ పంచడంలో దర్శక , నిర్మాత కరణ్ జోహర్ ది అందెవేసిన చేయి. ఏకంగా బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్లు రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ల ఫస్ట్ నైట్ రహస్యాలను కూడా బయటకు లాగిన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 21, 2022 / 11:04 PM IST
    Follow us on

    Koffee With Karan 7: Samantha opens up on divorce with Naga Chaitanya :  దేశంలోని సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వారి వ్యక్తిగత జీవితాల్లోని లోతులను బయటకు లాగి జనాలకు మసాలా ఎంటర్ టైన్ మెంట్ పంచడంలో దర్శక , నిర్మాత కరణ్ జోహర్ ది అందెవేసిన చేయి. ఏకంగా బాలీవుడ్ అగ్ర హీరో, హీరోయిన్లు రణ్ వీర్ సింగ్, ఆలియా భట్ ల ఫస్ట్ నైట్ రహస్యాలను కూడా బయటకు లాగిన చరిత్ర కరణ్ జోహర్ సొంతం. తాజాగా కాఫీ విత్ కరణ్7 ఈరోజు రాత్రి ఎపిసోడ్ లో మన దక్షిణాది హీరోయిన్ సమంత పాల్గొని తన వ్యక్తిగత , సినీ జీవితంలోని అనుభూతులను పంచుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులపై సంచలన విషయాలు పంచుకుంది. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.

    సమంత రూత్ ప్రభు కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్ లో నాగచైతన్యతో గొడవలు, విడాకులపై సంచలన విషయాలు బయటపెట్టింది. సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో ఉన్న సంబంధం గురించి, విడాకుల తర్వాత వ్యాపించిన పుకార్లపై స్పందించింది.. షో హోస్ట్ కరణ్ జోహార్ ‘నాగ చైతన్యను మీ “భర్త” అని’ అనగా.. వెంటనే కల్పించుకున్న సమంత వెంటనే కరణ్ జోహర్ ని సరిదిద్ది “మాజీ భర్త” అని చెప్పి షాక్ ఇవ్వడం విశేషం.

    విడాకుల తర్వాత మీరిద్దరూ కనీసం స్నేహపూర్వకంగా ఉన్నారా అని కరణ్ ప్రశ్నించగా.. ” మీరు మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచినట్లయితే ప్రస్తుతానికి గదిలో పదునైన వస్తువులను దాచవలసి ఉంటుంది ” అంటూ విడాకుల తర్వాత తమ మధ్య వైరం, దూరం గొడవలు బాగా పెరిగిపోయాయని సమంత చెప్పకనే చెప్పింది. “కానీ అది భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకే గదిలో ఉండవచ్చు” అంటూ ముక్తాయింపు ఇచ్చి ట్విస్ట్ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకులు సామరస్యంగా జరగలేదని సమంత క్లారిటీ ఇచ్చింది. నాగ చైతన్యతో విడాకులు తీసుకోవడం తనకు చాలా కష్టమని సమంత తెలిపింది. “విడాకులు చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు బాగుంది. పర్లేదు. నేను ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాను.” ప్రస్తుతానికి మామధ్య అనుకూలమైన పరిస్థితి లేదు” అని సమంత తెలిపింది అసలు ఈ వృత్తిలోకి రావాలని అనుకోలేదని.. ఎందుకంటే ఇంట్లో కష్టాలు ఉన్నాయి. మా దగ్గర ఇంకా పెద్దగా డబ్బు లేదు.. కానీ అవేవీ లేకున్నా నిజంగా సంతోషంగానే ఉన్నానని సమంత తెలిపింది.

    నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత వందల కోట్ల భరణం తీసుకుందని సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి కరణ్ ప్రశ్నించగా సమంత ఆసక్తికరంగా సమాధానమిచ్చింది. 250 కోట్లు భరణంగా తీసుకున్నట్లు తనపై వార్తలు వచ్చాయని సమంత తెలిపింది.
    ఈ భరణం గురించి నివేదికలు వెలువడిన తర్వాత ఆదాయపు పన్ను శాఖ అధికారులు తన ఇంటిపై దాడి చేయడానికి వచ్చారని సమంత చమత్కరించింది. ” నేను దాని గురించి నిజంగా ఫిర్యాదు చేయలేను ఎందుకంటే నేను ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. నేను పారదర్శకంగా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే సినీ ప్రయాణాన్ని తిరిగి ఎంచుకున్నాను. నా జీవితంలో చాలా విషయాలు వెల్లడిస్తాను. విడిపోయినప్పుడు నేను దాని గురించి చాలా కలత చెందలేకపోయాను ఎందుకంటే వారు నా జీవితంలో పెట్టుబడి పెట్టారు. ఆ సమయంలో నేను లేని సమాధానాలను కలిగి ఉండటం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. నేను దాని నుండి బయటకు వచ్చాను. ఏది జరిగినా నాకు మంచిదే.” అంటూ సమంత విడాకులకు దారితీసిన పరిస్థితులను పరోక్షంగా చెప్పుకొచ్చింది. తనను సినిమాల్లో ఒక పెట్టుబడిగా చూశారని సమంత ఆరోపణలు చేయడం సంచలనమైంది.

    సమంత విడాకులకు సంబంధించిన సంభాషణలు షోలో ప్రధానమైన అంశంగా హైలట్ అయ్యాయి. కరణ్ జోహర్ కు ఆఫ్ కెమెరాలో తన విడాకుల గురించి చెబుతానని.. ఇప్పటికే కొంచెం చెప్పానని సమంతా వెల్లడించింది.

    కరణ్ తన పెళ్లి గురించి మాట్లాడమని సమంతను అడిగినప్పుడు..”కరణ్‌ లా జీవించాలని నాకు ఆసక్తి ఉంది. వివాహాలు సంతోషంగా ఉండడానికి మీరే కారణం. మీరు జీవితాన్ని కభీ ఖుషీ కభీ ఘమ్ గా చిత్రీకరించారు. వాస్తవానికి అది KGF”అంటూ పెళ్లిళ్లు పెనుభారమని సమంత ఓపెన్ అయ్యింది. నాగచైతన్యతో పెళ్లి చేసుకున్నాక తన బతుకు ‘కేజీఎఫ్’లా మారిందని పరోక్షంగా దెప్పిపొడించింది.

    ఏ మాయ చేసావే మరియు ఆటోనగర్ సూర్య వంటి చిత్రాల్లో సమంతా రూత్ ప్రభు -నాగ చైతన్య కలిసి నటించారు. ఆ క్రమంలోనే ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. గత సంవత్సరం ఉమ్మడి ప్రకటనలో ఈ తారలు సోషల్ మీడియాలో తమ విడిపోతున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరి విడాకులకు కారణాలపై అందరూ వెతుకుతున్నా ఎవరికీ సమాధానం దొరకడం లేదు. కానీ తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సమంత మాటలను బట్టి తమ భావాలు కలవలేదని..గొడవలతో విడిపోయినట్టు సమంత క్లారిటీ ఇచ్చింది.
    Recommended Videos