Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani- Vallabhaneni Vamsi: కొడాలి నాని, వల్లభనేని వంశీ సైలెంట్., వెనుక కారణమేంటి?

Kodali Nani- Vallabhaneni Vamsi: కొడాలి నాని, వల్లభనేని వంశీ సైలెంట్., వెనుక కారణమేంటి?

Kodali Nani- Vallabhaneni Vamsi
Kodali Nani- Vallabhaneni Vamsi

Kodali Nani- Vallabhaneni Vamsi: బావ కళ్లల్లో ఆనందం చూడాలి.. తెలుగునాట ఈ మాట చాలా ప్రాచుర్యం పొందింది. ఓ ఫ్యాక్షన్ హత్యలో నిందితుడు చెప్పిన మాట ఇది. ఎందుకలా చేశావంటే బావ కళ్లలో ఆనందం చూడడానికేనంటూ చెప్పుకొస్తాడు. అటు తరువాత ఈ మాట అన్ని సందర్భాల్లో వాడడం మొదలుపెట్టారు. కామెడీ జోనర్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీ పొలిటిక్స్ లో కూడా ఈ మాట మరోసారి గుర్తుకొచ్చింది. ఈసారి మాత్రం ఆనందం బదులు ‘విషాదం’ అన్న మాట చేర్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తరువాత టీడీపీ శ్రేణులు ఓ ఇద్దరి కళ్లల్లో ఉన్న విషాదాన్ని చూసేందుకు తెగ తహతహలాడారు. వారే వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని, టీడీపీ ధిక్కార స్వరం వల్లభనేని వంశీమోహన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయాలను మరింత జుగుప్సాకరంగా మార్చిన ఘనత కొడాలి నానిదే. అటు తరువాత ఆ స్థానం వంశీది. నోటికి ఎంతొస్తే అంత మాట అనడంలో వీరు ముందుండేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లపై వీరు వాడిన భాష అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంతో వీరి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది.

పొడిపొడిగా తిట్టి .. కనుమరుగై…
గడిచిన కొద్దిరోజులుగా ఆ ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారు. మీడియా ముందుకు వచ్చేందుకు సైతం ఇష్టపడడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఈ ఇద్దరు నేతలు ఎప్పటిలానే రాయలేని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబును.. ఆయన కుమారుడు లోకేశ్ ను నోటికి వచ్చినట్లుగా బండబూతులు తిట్టేయటం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో కానీ.. ఈ ఇద్దరు వైసీపీ ఫైర్ బ్రాండ్లుతమ నోటికి తాళం వేసినట్లుగా కామ్ గా ఉండటాన్ని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా నోటికి వచ్చినట్లు తిట్టి పోసే కొడాలి నాని.. వల్లభనేని వంశీలు మూడురోజులుగా ఎందుకు మాట్లాడటం లేదన్నది చర్చగా మారింది. వారికి హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలివ్వడం వల్లే సైలెంట్ అయ్యారన్న ప్రచారం ఊపందుకుంది.

ఆ దూకుడు.. లేదెందుకు?
రాజకీయాల్లో దూకుడు స్వభావం కొద్దిరోజుల పాటే పనిచేస్తుంది. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడడం తొలిరోజుల్లో ఫ్యాషన్ గా కనిపిస్తుంది. అటు తరువాత అది వికటిస్తుంది. ముదిరితే వెగటుగా మారుతుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ విషయంలో ఇదే జరిగింది. వారి దూకుడును తొలుత వైసీపీ హైకమాండ్ ప్రోత్సహించింది. రాజకీయ ప్రత్యర్థులను ఎంత తూలనాడితే అంతగా వారిని అక్కున చేర్చుకుంది. అయితే సామాన్య జనం, రాజకీయాలతో సంబంధం లేని వారికి మాత్రం ఇది నచ్చలేదు. వైసీపీ, జగన్ ను అభిమానించే వారు సైతం ఈ చర్యలను తప్పుపట్టారు. రాజకీయ సిద్ధాంతాలు, వైరం నుంచి వ్యక్తిగతంగా మారడం, అధికార పార్టీ నేతలు వారించకపోగా.. ప్రోద్బలం పెరగడం వంటి కారణాలతో చాలా మంది తటస్థులు దూరమయ్యారు. అవే హెచ్చరికలు నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి అందడంతో వారిని పక్కనపెట్టారన్న ప్రచారం జరుగుతోంది.

Kodali Nani- Vallabhaneni Vamsi
Kodali Nani- Vallabhaneni Vamsi

ఎన్నికల ఫలితాలే కారణమా?
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలోనే కొడాలి నాని.. వల్లభనేని వంశీలు మాట్లాడకుండా ఉన్నారన్న చర్చ అయితే మాత్రం ఒకటి ఏపీలో వ్యాపిస్తోంది. . నాలుగేళ్లుగా ఇష్టారాజ్యంగా మాట్లాడేసిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన.. వారు చేసిన తప్పులు తగ్గిపోవంటూ ఫైర్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వారిని అస్సలు క్షమించే చాన్సే లేదని చెబుతున్నారు. తమను అనాల్సిన మాటలు ఇంకేమైనా ఉన్నాయా? అంటూ టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగామారింది. జగన్ కాదు రాజకీయ ప్రత్యర్థి… కొడాలి నాని, వల్లభనేని వంశీలే అన్నట్టు టీడీపీ శ్రేణులు కాచుక్కొని కూర్చున్నాయి. అధికారం చేతిలోకి వస్తే శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యతలు మారిపోతాయి. గతంలో కూడా ఇటువంటి నేతల విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసిందేనని విశ్లేషకులు చెబుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version