నటీనటులు : సల్మాన్ ఖాన్, విక్టరీ వెంకటేష్, జగపతి బాబు, పూజా హెగ్డే , భూమిక తదితరులు
దర్శకత్వం : ఫర్హాద్ సంజీ
నిర్మాత : సల్మాన్ ఖాన్
సంగీత దర్శకులు : దేవి శ్రీ ప్రసాద్, షాజిద్ ఖాన్, హిమేష్ రేష్మియా
సినిమాటోగ్రఫీ : మణికందన్
Kisi Ka Bhai Kisi Ki Jaan Movie Review : ఈమధ్య బాలీవుడ్ హీరోలు మరియు దర్శక నిర్మాతలు మన సౌత్ ఇండియన్ సినిమాల మీద కన్ను వేశారు.కుదిరితే మన సౌత్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడమో,అది కూడా కుదరకపోతే మన సౌత్ సినిమాలను రీమేక్ చెయ్యడమో చేసేస్తున్నారు.సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చెయ్యడం లో ఎలాంటి తప్పు లేదు.అది ప్రతీ భాషలో జరుగుతున్నదే.కానీ ఫ్లాప్ సినిమాని రీమేక్ చెయ్యడం అనేది బహుశా మనం ఎక్కడా చూసి ఉండము.సల్మాన్ ఖాన్ ఆ రిస్క్ చేసాడు, విషయం లోకి వెళ్తే తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ఫ్లాప్ చిత్రం ‘కాటమరాయుడు’ ని హిందీ లో ఆయన ‘కిసీ కా భాయ్..కిసీ కా జాన్’ పేరిట రీమేక్ చేసి నేడు విడుదల చేసాడు.ఈ చిత్రం ఎలా ఉందో, బాలీవుడ్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
భాయిజాన్(సల్మాన్ ఖాన్) తన ప్రాంతం లో యువకులకు ఆత్మరక్షణ శిక్షణని ఇస్తూ ఉంటాడు.ఈయనకి ముగ్గురు తమ్ములు కూడా ఉంటారు.పెళ్లి అంటే అసలు ఇష్టమే లేని భాయిజాన్ తో ఎలా అయినా పెళ్లి చేయించాలని తెలుగు అమ్మాయి బాగ్యలక్ష్మి (పూజా హెగ్డే) ని సల్మాన్ ఖాన్ తో కలపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మొత్తానికి వాళ్ళిద్దరిని ప్రేమలో పడేలా చేస్తారు.అయితే భాయిజాన్ ఊర్లో ఎవరికీ కష్టం వచ్చిన వాళ్లకి సహాయం చెయ్యడం లో ముందు ఉంటాడు.ఈ క్రమం లో ఎప్పుడూ గొడవల్లోనే ఉంటాడు.మరో పక్క భాగ్యలక్ష్మి కి గొడవలు అంటేనే ఇష్టం లేని విధంగా పెంచుతాడు ఆమె అన్నయ్య ( విక్టరీ వెంకటేష్).ఆమె ప్రేమ పొందడం కోసం గొడవలన్నీ ఆపేసినట్టుగా నటిస్తూ ఉంటాడు భాయిజాన్.కానీ విక్టరీ వెంకటేష్ మరియు ఒక రౌడీ షీటర్ (జగపతి బాబు) మధ్య పాత గొడవలు ఉంటాయి.జగపతి బాబు పగ తీర్చుకోవడం కోసం వెంకటేష్ కుటుంబం పై చేసే దాడులను సమర్థవతంగా ఎగురుకుంటూ వస్తుంటాడు భాయిజాన్.ఇక ఆ తర్వాత ఏమి జరిగింది అనేదే స్టోరీ.
విశ్లేషణ :
ఓటీటీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత రీమేక్ చెయ్యడం అంటే కత్తి మీద సాము చెయ్యడం లాంటిదే.ఒకవేళ రీమేక్ చేస్తే మాతృకని ఏమాత్రం పోల్చి చూసేలా ఉండకుండా, సరికొత్తగా ఉండేట్టు చూపించాలి.అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ సినిమాలో కూడా డైరెక్టర్ అదే చేసాడు కానీ, ఒక్క సన్నివేశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యే విధంగా లేదు.కానీ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ కి మాత్రం కొన్ని సన్నివేశాలు నచ్చవచ్చు.తెలుగు అమ్మాయి మరియు హిందీ అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథగా ఈ సినిమాని మన సౌత్ ఆడియన్స్ కి కూడా దగ్గర చేసే విధంగా డైరెక్టర్ ఎదో ప్రయత్నం చేసాడు.సౌత్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు విక్టరీ వెంకటేష్ ని కూడా తీసుకున్నాడు కానీ ఆయన పాత్ర ఈ సినిమాకి ఏమాత్రం ప్లస్ కాలేదు.
పూజ హెగ్డే తన అందచందాలతో కాసేపు ప్రేక్షకులకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేసింది,ఇక ఈ సినిమాలోని పాటలకు సల్మాన్ ఖాన్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు పెద్ద ట్రోల్ స్టాఫ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే.వీడియో సాంగ్స్ విడుదలైనప్పుడే సోషల్ మీడియా లో దీనిపై ఒక రేంజ్ లో ట్రోలింగ్ నడించింది.సినిమాలో అయినా మంచి స్టెప్పులను పెట్టి ఉంటారేమో అని అభిమానులు ఆశించారు.కానీ సినిమాలో కూడా అదే రేంజ్ ట్రోల్ స్టఫ్ ని ఇచ్చాడు సల్మాన్ ఖాన్.ఇక ఈ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించిన ‘ఏంటమ్మా’ సాంగ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాసేపు సల్మాన్ ఖాన్ మరియు విక్టరీ వెంకటేష్ తో కలిసి డ్యాన్స్ వెయ్యడం ఫ్యాన్స్ కి కనుల పండుగ లాగ అనిపించింది.కేవలం ఈ ఒక్క పాట కోసం సినిమా చూడాలి అని వెళ్లిన అభిమానులు మాత్రం సంతృప్తితోనే బయటకి వస్తారు.
చివరి మాట : రొటీన్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడని వారు ఈ చిత్రానికి దూరంగా ఉండండి.ఎదో కాసేపు టైం పాస్ చేద్దాము అనుకోని వెళ్ళాలి అనుకున్నవాళ్ళు మాత్రం వెళ్లొచ్చు.
రేటింగ్ : 2.5/5