
పాన్ ఇండియన్ లెవెల్ లో మంచి డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కియారా అద్వానీ..రీసెంట్ గానే ఈమె బాలీవుడ్ క్రేజీ హీరో సిద్దార్థ మల్హోత్రా ని పెళ్లాడింది.ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.ఎప్పటి నుండో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వచ్చేవి,కానీ దానిపై వాళ్లిద్దరూ ఎప్పుడూ కూడా స్పందించే ప్రయత్నం చెయ్యలేదు కానీ, ఒక్కేసారి పెళ్లి పీటలు ఎక్కి అందరికీ ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు.
పెళ్లి తర్వాత కూడా కియారా అద్వానీ చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా ఉంది.ప్రస్తుతం ఆమె శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో పాటుగా హిందీ లో మరో సినిమా చేస్తుంది.ఇది ఇలా ఉండగా ఇప్పుడు కియారా అద్వానీ సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అదేమిటంటే మార్చి నాల్గవ తేదీన ముంబై లో ప్రారంభం కానున్న ‘ఉమెన్స్ ప్రీమియర్ లీగ్’ టోర్నమెంట్ ప్రారంభోత్సవం లో పాల్గొనబోతుంది.అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతున్న ఈ లీగ్ మొదటి మ్యాచ్ గుజరాత్ జైన్ట్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరగబోతుంది.ఈ మ్యాచ్ ప్రారంభోత్సవం కియారా అద్వానీ హాట్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో మొదలు కాబోతుందని తెలుస్తుంది.

ఒక క్రికెట్ మ్యాచ్ లో లైవ్ పెర్ఫార్మన్స్ కియారా అద్వానీ ఇవ్వడం ఇదే తొలిసారి.ఈ వార్త తెలిసినప్పటి నుండి ఆమె అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.IPL మ్యాచులకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ అయితే వచ్చింది WPL మ్యాచులకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందని BCCI ఆశిస్తుంది.మరి వాళ్ళ అంచనాలను ఈ లీగ్ మ్యాచులు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.