
Bhola Shankar: వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. 2023 సంక్రాంతి విన్నర్ గా రికార్డులకు ఎక్కారు. బాలయ్యతో పాటు విజయ్, అజిత్ లపై పై చేయి సాధించారు. ఫ్యాన్స్ ని మెప్పించే మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు బాబీ ఆకట్టుకున్నాడు. ఇక రవితేజ పాత్ర సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచింది. శృతి గ్లామర్, దేవిశ్రీ సాంగ్స్… వెరసి భారీ హిట్ పడింది. ఇక చిరంజీవి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆచార్య చేదు అనుభవాలను వాల్తేరు వీరయ్య తో చెరిపేశారు. ఈ జోష్ లో భోళా శంకర్ చిత్ర షూటింగ్ పూర్తి చేస్తున్నారు. కాగా టాలీవుడ్ వర్గాల్లో ఓ షాకింగ్ రూమర్ చక్కర్లు కొడుతుంది. యాంకర్ శ్రీముఖితో చిరంజీవి రొమాన్స్ చేయనున్నాడట.
భోళా శంకర్ చిత్రంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ఓ ఐకానిక్ సీన్ స్పూఫ్ చేస్తారట. ఖుషి మూవీలో చిరుగాలికి భూమిక పైట పక్కకు జరుగుతుంది. పవన్ ఏమరపాటుగా ఆమె నడుము చూస్తారు. సరిగ్గా అప్పుడే పవన్ ని చూసిన భూమిక అపార్థం చేసుకుంటుంది. అప్పట్లో థియేటర్స్ ని షేక్ చేసిన ఈ రొమాంటిక్ సీన్లో చిరంజీవి నటించబోతున్నారట. యాంకర్ శ్రీముఖి భూమికగా, చిరు పవన్ కళ్యాణ్ గా ఈ స్పూఫ్ సీన్ చేయనున్నారట. టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
మరొక విశేషం ఏమిటంటే పవన్ కళ్యాణ్ అభిమానిగా చిరంజీవి కనిపిస్తారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇదే జరిగితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. కాగా భోళా శంకర్ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ చిత్రం వేదాళం అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది. తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. భోళా శంకర్ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకుని స్ట్రీక్ ఆఫ్ శంకర్ అంటూ చిరు లుక్ విడుదల చేశారు. ఢమరుకం పట్టుకొని చిరంజీవి మెస్మరైజింగ్ లుక్ లో కేక పుట్టించారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య చిత్రాల సక్సెస్ జర్నీ కొనసాగిస్తూ భోళా శంకర్ మూవీతో చిరంజీవి హ్యాట్రిక్ పూర్తి చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.