‘Khushi’ Movie Tickets : బ్లాక్ లో అమ్ముడుపోతున్న ‘ఖుషి’ టిక్కెట్లు.. ఒక్కో టికెట్ ఎంతో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది?

‘Khushi’ Movie Tickets : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే..పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో విడుదల చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటూ వచ్చారు..మొత్తానికి వాళ్ళ కోరిక నెరవేరబోతుండడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..పవన్ కళ్యాణ్ […]

Written By: NARESH, Updated On : December 29, 2022 9:46 pm
Follow us on

‘Khushi’ Movie Tickets : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం ఈ నెల 31 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా రీ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే..పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా మరోసారి థియేటర్స్ లో విడుదల చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటూ వచ్చారు..మొత్తానికి వాళ్ళ కోరిక నెరవేరబోతుండడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదలైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హంగామా ఉంటుందో..ఖుషి సినిమాకి కూడా అలాంటి హుంగామా కనిపిస్తుంది.

ఈ మధ్య రీ రిలీజ్ ని హీరోల పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తారు..ఎందుకంటే అప్పుడు విడుదల చేస్తే మంచి వసూళ్లు వస్తాయని..పుట్టిన రోజు కాకుండా మరో సందర్భం లో విడుదల చెయ్యడానికి భయపడుతుంటారు..కానీ ఖుషి చిత్రం విషయం లో మాత్రం నిర్మాతలు ధైర్యం చేసి విడుదల చేసేసారు..మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారు కానీ..ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించలేదు.

స్టార్ హీరోల కొత్త సినిమాలకు బెన్ఫిట్ షోస్ పడడం చాలా కామన్..కానీ రీ రిలీజ్ సినిమాకి బెన్ఫిట్ షో పడడం ఎప్పుడైనా చూసారా..ఖుషి విషయం లో అదే జరిగింది..కొన్ని ప్రాంతాలలో ఈ సినిమాకి బెన్ఫిట్ షో లు ప్లాన్ చేసారు..ఒక్కో టికెట్ వెయ్యి రూపాయలట..వెయ్యి రూపాయిలు పెట్టి ఎవరు చూస్తారు అనుకునేరు..ఆ టిక్కెట్లు కేవలం అరగంట వ్యవధి లో అమ్ముడుపోయాయి..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.

రెండు దశాబ్దాల క్రితం విడుదలైన ఒక సినిమాకి ఈ రేంజ్ మేనియా , ఈ రేంజ్ క్రేజ్ కలలో కూడా ఊహించలేదని సినీ పండితులు చెప్తున్న మాట..ఇప్పటి వరకు ఈ చిత్రానికి దాదాపుగా కోటి 50 లక్షల రూపాయిల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి..లక్ష టికెట్స్ కి పైగా ఆన్లైన్ లో అమ్ముడుపోయాయి..ఒక రీ రిలీజ్ సినిమాకి ఈ రేంజ్ బుకింగ్స్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు చూడలేదు..భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి తప్ప మరో హీరోకి చూడలేము అంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.