https://oktelugu.com/

KGF2 Collections: దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 6వ చిత్రంగా కేజీఎఫ్2.. ఆర్ఆర్ఆర్ ను బీట్ చేస్తుందా?

KGF2 Collections: ఇన్నాళ్లు బాలీవుడ్ హిందీ సినిమాలకు దేశంలో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత దక్షిణాదిన తమిళ సినిమాలు సత్తా చాటేవి. కానీ తెలుగు నుంచి మన రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ‘ప్యాన్ ఇండియా’ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి అవతరించాడు. భాషా బేధం లేకుండా అందరినీ కూర్చుండబెట్టి సినిమాను మెప్పించగల దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు. బాహుబలి స్ఫూర్తితో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2022 / 06:37 PM IST

    KGF 2 4 Days Collections

    Follow us on

    KGF2 Collections: ఇన్నాళ్లు బాలీవుడ్ హిందీ సినిమాలకు దేశంలో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆ తర్వాత దక్షిణాదిన తమిళ సినిమాలు సత్తా చాటేవి. కానీ తెలుగు నుంచి మన రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ‘ప్యాన్ ఇండియా’ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి అవతరించాడు. భాషా బేధం లేకుండా అందరినీ కూర్చుండబెట్టి సినిమాను మెప్పించగల దర్శకుడిగా రాజమౌళి నిలిచాడు.

    KGF Chapter 2 Collections

    బాహుబలి స్ఫూర్తితో ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైన కన్నడ చిత్రం ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదివారం ఈ మూవీ కలెక్షన్లు మరింతగా పెరిగాయి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల సంఖ్య ₹883 కోట్లకు చేరుకుందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలిపారు.

    ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ ప్రకారం.. యష్ నటించిన ఈ చిత్రం ఇప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ సినిమాలలో ఆరో స్థానంలో ఉంది. ఇది అమీర్ ఖాన్ యొక్క బ్లాక్ బస్టర్ ‘పీకే’ కలెక్షన్లు ₹854 కోట్లను అధిగమించిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

    Also Read: Mahesh Babu: ‘కేజీఎఫ్ 2’ మ‌హేష్ కు న‌చ్చ‌లేదా ? అందుకే మౌనంగా ఉన్నాడు ?

    అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ మూవీ దేశంలోనే ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన నంబర్ 1 చిత్రంగా నిలిచింది. ఈ మూవీ కలెక్షన్లు దేశంలోనే అత్యధికంగా 2024 కోట్లుగా ఉన్నాయి. ఇక రెండో స్థానంలో రాజమౌళి చెక్కిన బాహుబలి2 సినిమా నిలిచింది. ఇది 1819 కోట్లు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతానికి రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 3వ స్థానంలో ఉంది. ఈ సినిమా అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 1200 కోట్లు వసూళ్లు గ్రాస్  సాధించి దూసుకెళుతోంది.. ఇకో నాలుగో స్థానంలో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ ఉంది. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే అత్యధికంగా 969 కోట్లు కలెక్ట్ చేసింది.

    ఇక దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో  5వ స్థానంలో అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’.. 967 కోట్లు.. 6వ స్థానంలో పీకే 854 కోట్లు ఉండేది. ఇప్పుడు పీకేను వెనక్కి నెట్టి ‘కేజీఎఫ్2’ ఆరోస్థానంలోకి వచ్చింది. 7వ స్థానంలోకి పీకే చేరింది. , 8వ స్థానంలో ‘రోబో 2.0’ 800 కోట్లు.. 9వ స్థానంలో బాహుబలి1 650 కోట్లు, 10వ స్తానంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ 623 కోట్లు ఉన్నాయి.

    కేజీఎఫ్ 2 ఊపు చూస్తుంటే ఈ మూవీ మూడో స్థానానికి చేరడం గ్యారెంటీగా కనిపిస్తోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీని బీట్ చేస్తుందా? లేదా? అన్నది చూడాలి.

    Also Read: Suma: రాజీవ్ కనకాలతో గొడవలు నిజమే.. సుమ సంచలన వ్యాఖ్యలు వైరల్!

    Recommended Videos: