Homeఎంటర్టైన్మెంట్Keerthy- Sri Satya: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి కీర్తి - శ్రీసత్య...

Keerthy- Sri Satya: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి కీర్తి – శ్రీసత్య అవుట్..ఆది రెడ్డి లక్ మాములుగా లేదు

Keerthy- Sri Satya: ఎన్నో భారీ అంచనాల నడుమ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు చివరి దశకి చేరుకుంది..21 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈ సీజన్ మొన్న ఫైమా ఎలిమినేషన్ తో 7 మంది కంటెస్టెంట్స్ కి చేరుకుంది..గొడవలు, సరదాలు మరియు భావోద్వేగాల నడుమ ఈ సీజన్ మంచిగానే కొనసాగింది..ప్రారంభం లో చాలా చప్పగా సాగడం తో టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పడిపోయాయి..అందువల్ల డిజాస్టర్ అయిపొతుందెమో అనుకున్న ఈ సీజన్ ని ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరించి మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని అందుకున్నారు.

Keerthy- Sri Satya
Keerthy- Sri Satya

ఇక ఈ వారం శ్రీహాన్ మినహా, మిగిలిన ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు..వీరిలో ప్రస్తుతం ఉన్న వోటింగ్ ప్రకారం శ్రీ సత్య మరియు కీర్తి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటె ఇద్దరు వెళ్ళిపొయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది..ప్రస్తుతం ఉన్న వోటింగ్ ప్రకారం ఎవరెవరు ఏ స్థానం లో ఉన్నారో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా రేవంత్ అందరికంటే అత్యధిక ఓట్లతో నెంబర్ 1 స్థానం లో ఉన్నాడు..అతని తర్వాత ఇనాయ రెండవ స్థానం లో కొనసాగుతుండగా..రోహిత్ మూడవ స్థానం లో..మరియు ఆది రెడ్డి నాల్గవ స్థానం లో కొనసాగుతున్నాడు..వోటింగ్ లో రోహిత్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది..అతను టాప్ 3 లో ఒకరిగా నిలిచే అవకాశం కూడా లేకపోలేదు..ఇక ఆది రెడ్డి గత వారం తో పోలిస్తే ఈ వారం మంచి వోటింగ్ లో కొనసాగుతున్నాడు..గత వారం లో టికెట్ 2 ఫినాలే టాస్కు లో ఆది రెడ్డి గెలిచాడనే ప్రచారం వల్లే ఆయనకీ వోటింగ్ తగ్గిందని విశ్లేషకులు చెప్తున్న మాట.

Keerthy- Sri Satya
Keerthy

ఎందుకంటే టికెట్ గెలుచుకున్న వాళ్ళు నేరుగా ఫైనల్స్ కి వెళ్ళిపోతారని..వాళ్లకి ఓటు వేసి కూడా ఉపయోగం ఉండదనే భావన ప్రేక్షకుల్లో కలిగిందని..అందుకే ఆది రెడ్డి కి గత వారం వోటింగ్ శాతం తగ్గిందని..కానీ ఈ వారం అతనికి మంచి వోటింగ్ ఉందని విశ్లేషకులు చెప్తున్నారు..చివరిగా టాప్ 5 రేస్ లోకి రేవంత్ , రోహిత్ , శ్రీహన్ , ఆది రెడ్డి మరియు ఇనాయ వెళ్తారని తెలుస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version