Homeజాతీయ వార్తలుCM KCR Letter: కేసీఆర్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారోచ్‌.. బహిరంగ లేఖ వెనుక కథ ఇదీ!

CM KCR Letter: కేసీఆర్‌కు కార్యకర్తలు గుర్తొచ్చారోచ్‌.. బహిరంగ లేఖ వెనుక కథ ఇదీ!

CM KCR Letter
CM KCR Letter

CM KCR Letter: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ కార్యకర్తలు గుర్తొచ్చారు. వాస్తవానికి కేసీఆర్‌ ప్రాధాన్యత క్రమం ఇలా ఉంటుంది. ఫస్ట్‌ ప్రయారిటీ కూతురు, కొడుకు, అల్లుడు, సడ్డకుని కొడుకు, తర్వాత కాంట్రాక్టర్లు, ఆ తర్వాత మిగతా మంత్రులు, మూడో ప్రయారిటీ ఎమ్మెల్యేలు, అడపా దడపా ప్రజలు, కేసీఆర్‌ జాబితాలో ఆఖరున ఉండేది ఆయన పార్టీ క్యాడర్‌. ఎన్నికల సమయంలో కూడా ఆయన కార్యకర్తల కనీసం గుర్తు కూడా చేసుకోరు. ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు, నేతలకే దిశానిర్దేశం చేస్తారు. కానీ, కష్టాలు చుట్టు ముడుతున్న వేళ.. కేసీఆర్‌కు గ్రౌండ్‌ గుర్తొచ్చింది. చాలాకాలం తరువాత బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా ఎన్నికలకు పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తూ వారికి దిశా నిర్దేశం చేశారు.

కుటుంబ సభ్యులతో సమానం అంటూ..
భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు అంటూ కేసీఆర్‌ క్యాడర్‌ను ప్రస్తావించారు. ఇలా ప్రధాన్యత ఇవ్వడం 21 ఏళ్ల బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో ఇదే మొదటిసారి. ఫ్యామిలీ సెంటిమెంట్‌ రగిల్చే ప్రయత్నంలో భాగంగానే ఈ పదప్రయోగం చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సాగిన ప్రస్తానాన్ని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్రం సాధించిన ఘనత మీదే అంటూ..
ఇక తెలంగాణ కోసం కొట్లాడింది నేనే.. తెచ్చింది నేనే.. అంటూ క్రెడిట్‌ మొత్తం ఇన్నాళ్లూ తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్‌ తాజాగా లేఖలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత మీదే అంటూ క్రెడిట్‌ మొత్తాన్ని కార్యకర్తల ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. తద్వారా ఉద్యమాన్ని, ఉద్యమకారులను గౌరవిస్తున్నలు కార్యకర్తలో అభిప్రాయం కలిగేలా సెటిమెంట్‌ రగిల్చారు. 14 ఏళ్లలో పార్టీ ఎదుర్కొన్న అనేక కష్టనష్టాలను గుర్తు చేస్తూ కేసీఆర్‌ రాసిన లేఖలో ‘‘మీరే నా బలం.. నా బలగం’’ అంటూ గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితి పేరుతో అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశవ్యాప్తం అవుతున్నామని పేర్కొన్న కేసీఆర్‌ తాను చేసే ఈ ప్రయత్నానికి అందరూ కలిసి రావాలని కేంద్రంలో కిసాన్‌ సర్కార్‌ స్థాపించే వరకు ఎవరూ మడమ తిప్పకూడదని తన లేఖ ద్వారా కోరారు. అయితే కేసీఆర్‌ ఇప్పుడు లేఖ రాయడంపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. క్యాడర్‌ దూరమవుతుందన్న సంకేతాలు గులాబీ బాస్‌కు అందాయా అన్న సందేహం వ్యక్తమవుతోంది. అధిష్టానానికి శ్రేణులకు మధ్య దూరం పెరుగుతుందన్న భావనతోనే ఇలా పేర్కొని ఉంటారని తెలుస్తోంది.

CM KCR Letter
CM KCR Letter

విపక్షాలపై విమర్శలు..
బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ తాను రాసిన లేఖ ద్వారా రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందకూడదని, ఈ పరిస్థితులన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సష్టిస్తున్నవే అని, పనిగట్టుకొని బీఆర్‌ఎస్‌ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్‌లు దుష్ప్రచారాలు చేస్తున్నారని వాటని తిప్పి కొట్టాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కోవడానికి కేసీఆర్‌ తన సేనను తాను రాసిన బహిరంగ లేఖ ద్వారా చైతన్యవంతులను చేయాలని, వచ్చే ఎన్నికలకు గిరి గీసుకుని బరిలోకి దిగి బిఆర్‌ఎస్‌ సర్కార్‌ ను గెలిపించడానికి ప్రయత్నం చేయాలి అన్న సంకేతాన్ని ఇచ్చినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

క్యాడర్‌లో నైరాష్యంతోనే..
ఒకపక్క ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం, మరోపక్క టీఎస్‌పీఎస్పీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, ఇంకోవైపు ఎమ్మెల్యేల ఎరకేసులో ఎదురు దెబ్బలు వెరసి కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. ఈ క్రమంలో సందర్భోచితంగా, విషయ పరిజ్ఞానంతో మాట్లాడే కేటీఆర్‌ కూడా సహనం కోల్పోతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. బూతుపురాణం అందుకుంటున్నారు. మీడియాపైనా దాడులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన నైరాష్యం నెలకొంది. ముఖ్యమంత్రి కుటుంబానికే దిక్కులేదు.. మనం ఎంత అన్న భావన ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీ శ్రేణుల ముందు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యాడర్‌ ఆత్మస్థైర్యం కోలోపతోంది. ఇలాంటి పరిస్థితిలో శ్రేణుల్లో విశ్వాసం పెంచేలా, ధైర్యం కల్పించేలా ఈ లేఖ ద్వారా కేసీఆర్‌ ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది.

దేశ రాజకీయాలలో తాను బిజీగా ఉంటానని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మీదేనని చెప్పి కేసీఆర్‌ ఈసారి పార్టీని విజయపథం వైపు నడిపించాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ శ్రేణుల పైన ఉందని గుర్తు చేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజాక్షేత్రంలో ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తూనే, బీర్‌ఎస్‌ పార్టీ శ్రేణులను కూడా కార్యోన్ముఖులను చేస్తూ సెంటిమెంట్‌ను గుర్తుచేస్తూ గులాబీ బాస్‌ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version