Kashmerashah: బాలీవుడ్ లో పబ్ కల్చర్ బాగా ఎక్కువ. వీకెండ్ వచ్చిందంటే చాలు వయోబేధం లేకుండా నైట్ పార్టీలకు క్యూ కడతారు. పీకలదాకా తాగి పబ్లిక్ లో విన్యాసాలు చేస్తుంటారు. ఆ మధ్య అజయ్ దేవ్ గణ్ డాటర్ న్యాసా దేవ్ గణ్ ఫుల్ గా తాగి బాయ్ ఫ్రెండ్ తో పాటు తూలుతూ కనిపించింది. అసలు కార్ వద్దకు కూడా నడిచి వెళ్లలేని పరిస్థితిలో ఆమె ఉన్నారు. న్యాసా దేవ్ గణ్ మాదిరి పలువురు స్టార్ కిడ్స్, హీరోలు, హీరోయిన్స్ మద్యం మత్తులో ఊగుతూ కెమెరా కంటికి చిక్కారు. తాజాగా హీరోయిన్ కాశ్మీర షా వీరంగం చేసింది.
పబ్ లో ఫుల్ గా తాగి బయటకు వస్తున్న కాశ్మీర షా మీడియా ప్రతినిధులకు కనిపించారు. వారు ఫోటోలకు ఫొజివ్వాలని కోరారు. కిక్కులో అడ్డదిడ్డంగా కెమెరా ముందు కాశ్మీర షా హొయలు పోయారు. ఇంతలో కాశ్మీరా షా భర్త కృష్ణ అభిషేక్ అక్కడకు వచ్చారు. ఆయన్ని దగ్గరకు లాక్కుని అందరి ముందే ముద్దులతో ముంచెత్తింది. ఏకంగా పెదాల మీద ముద్దులు పెడుతూ జుర్రేసింది.
కాశ్మీర షా చర్యలకు మీడియా వాళ్ళు విస్తుపోయారు. కమాన్ కమాన్ అంటూ ఎంకరేజ్ చేశారు. ఇక వారి అరుపులకు కాశ్మీరా షా మరింత రెచ్చిపోయారు. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. కాశ్మీరా షా తెగింపు చూసి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐటెం భామగా కాశ్మీరా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆమె వెండితెర అరంగేట్రం తెలుగులోనే కావడం విశేషం. వెంకటేష్-సౌందర్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు మూవీలో కాశ్మీరా షా ఐటెం సాంగ్ చేశారు.
అనంతరం నాగార్జున హీరోగా తెరకెక్కిన రాముడొచ్చాడు మూవీలో ఒక స్పెషల్ నంబర్ చేశారు. మళ్ళీ ఆమె తెలుగులో కనిపించలేదు. 50 ఏళ్ల కాశ్మీరా షా 2001లో బ్రాడ్ లిస్టర్ మన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. 2007లో వీరికి విడాకులు అయ్యాయి. మరలా 2012లో కృష్ణ అభిషేక్ ని వివాహం చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు సంతానం ఉన్నారు. బిగ్ బాస్ హిందీ సీజన్ 14లో పాల్గొన కాశ్మీర షా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.