Karthikeya-2 Trailer : సముద్రంలోని ద్వారక రహస్యాన్ని కనిపెట్టే ‘కార్తికేయ2’

Karthikeya-2 Trailer : కార్తికేయ. ఒక దేవాలయం చుట్టూ అల్లుకున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. 2014లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. హీరో నిఖిల్ కు ఘన విజయం అదించి హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే టీం ‘కార్తికేయ2’అంటూ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా అంచనాలకు మించి ఆకట్టుకుంది.ట్రైలర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉండడం విశేషం. ఈ సినిమాను కూడా జీ […]

Written By: NARESH, Updated On : June 25, 2022 1:22 pm
Follow us on

Karthikeya-2 Trailer : కార్తికేయ. ఒక దేవాలయం చుట్టూ అల్లుకున్న ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. 2014లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. హీరో నిఖిల్ కు ఘన విజయం అదించి హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే టీం ‘కార్తికేయ2’అంటూ మరో సినిమాతో మన ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా అంచనాలకు మించి ఆకట్టుకుంది.ట్రైలర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఉండడం విశేషం. ఈ సినిమాను కూడా జీ గ్రూప్ ప్యాన్ ఇండియా స్థాయిలో దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది.

హీరోగా నిఖిల్, హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాలో హిందీ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించారు. కథాంశం జాతీయ స్తాయిది కావడం వల్లే దేశవ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది.

ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. సముద్రంలో మునిగిన ద్వారకా నగరం.. దాని వెనుకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది. సముద్రంలోకి హీరో నిఖిల్ వెళ్లడం.. ఆ తర్వాత మంచు పర్వతాలపై పరిశోధించడం.. చివరకు అష్టకష్టాలు పడి ఓ గుడిని కనిపెట్టి లోపలికి వెళితే అందులోని పాము అడ్డగించడం ఇలా ట్రైలర్ ఆసక్తికరంగా మలిచారు.

అనుపమ్ ఖేర్ లాంటి జాతీయ నటులు ఉండడం.. ద్వారక చుట్టూ కథ సాగడంతోనే ప్యాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా విడుదల చేస్తున్నారు. చందు మొండేటి లాంటి దర్శకుడు దాదాపు ఐదారేళ్లుగా ఈ సినిమాను తెరకెక్కించడం.. అవుట్ పుట్ అద్భుతంగా రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

-కార్తికేయ ట్రైలర్ ను కింద చూడొచ్చు


Recommended Videos