Karnataka High Court: బలవంతపు శృంగారంపై కర్నాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు మైనర్ అయితే నిందితుడుపై అర్హత కలిగిన అన్ని కేసులు బనాయించవచ్చని పేర్కొంది. అది వ్యభిచార గృహం అయినా సెక్స్ ఫోర్స్ చేస్తే మాత్రం అతడిని విటుడుగా కాకుండా నిందితుడిగానే పరిగణించాలని స్పష్టం చేసింది. బలవంతపు సెక్స్ కేసులో నిందితుడు తనపై బలమైన కేసులు పెట్టారని.. వాటి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దానిని తోసిపుచ్చుతూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేరళలోని కాసర్ గోడ్ కు చెందిన మహ్మద్ షరీఫ్ ఆకా ఫహీమ్ హాజీ మంగుళూరులోని ఓ వ్యభిచార గృహాన్ని సందర్శించాడు. ఆ సమయంలో మంగుళూరు పోలీసులు దాడిచేయడంతో షరీఫ్ పట్టుబడ్డాడు. అతడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. అయితే తాను ఒక కస్టమర్ గా మాత్రమే చూడాలని… కేసుల నుంచి విముక్తి కలిగించాలని కోర్టును కోరాడు. అయితే బాధితురాలు మైనర్ అయినందున కేవలం విటుడిగానే చూడలేమని..కస్టమర్ గా పరిగణించలేమని కోర్టు తేల్చిచెప్పింది.

ఈ కేసులో బాధితురాలి వయసు 17 సంవత్సరాలు. బంధువుల ఇంట్లో ఉండి చదవుకుంటోంది. ఈ నేపథ్యంలో సాయం చేస్తానని చెప్పిన కొందరు వ్యభిచారం రొంపిలోకి దింపాడు. కస్టమర్లతో సెక్స్ చేస్తుండగా వీడియోలు తీసి బయటపెడతానని బెదిరించేవారు. సోషల్ మీడియాలోపెడతామని హెచ్చరించేవారు. దీంతో వారు చెప్పిందల్లా ఆ బాలిక చేసేది. వారి చర్యలతో విసిగివేశారి పోయిన సదరు బాలిక తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే మానవ అక్రమ రవాణా, బలవంతపు శృంగారంతో పాటు మైనర్ తో సెక్స్ చేయించినందుకు పోలీసులు కేసు నమోదుచేశారు. -ఈ క్రమంలో షరీఫ్ పట్టుబట్టడంతో ఆయనపై కూడా అర్హత కలిగిన కేసులన్నింటినీ బనాయించారు. పోక్సోతో పాటు పలు చట్టాలకు సంబంధించి కేసు నమోదు చేశారు.

అయితే తనకు సంబంధం లేని కేసులు బనాయించారంటూ షరీఫ్ కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ ఎం.నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటీషనర్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. నిందితుడు కష్టమర్ అని.. అతడిపై మానవహక్కుల రవాణా కేసు ఎలా నమోదుచేస్తారని..దొరికింది ఒక కేసులో అయితే.. అన్నిరకాల కేసులు ఎలా పెడతారని వాదించారు. కేసును కొట్టి వేయాలని కోరారు. అయితే అందుకు న్యాయస్థానం తిరస్కరించింది. బాధితురాలు మైనర్ కాబట్టి.. ఆమె ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని మాత్రమే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. ఆమె పై నేరాలు వేర్వేరుగా ఉన్నాయని..అన్ని కేసులను ఒకే కేసుగా డిమాండ్ చేయడం సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో కోర్టులో నిందితుడికి చుక్కెదురయ్యింది.