Kantara OTT: అన్ని ప్రాంతీయ బాషలలో విడుదలై సంచలన విజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ‘కాంతారా’ చిత్రం OTT విడుదల కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు..ఎప్పుడో నవంబర్ మొదటి వారం లో OTT లోకి రావాల్సిన ఈ సినిమా కి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో OTT విడుదల ని వాయిదా వేయించారు ఆ చిత్ర మేకర్స్..దానితో ఎప్పటి నుండో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న OTT ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.

నవంబర్ 24 వ తేదీన విడుదల చేస్తారు అనే రూమర్ ఉండేది కానీ..దాని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం తో OTT ప్రేక్షకుల అయ్యోమయ్యం లో పడ్డారు..అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ సంస్థ రేపు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది అని అధికారిక ప్రకటన రావడం తో OTT ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడింది.
ఈరోజు అర్థ రాత్రి 12 గంటల నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది..థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి..తెలుగు లో ఈ సినిమాకి 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..కొన్ని ప్రాంతాలలో అయితే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సూపర్ హిట్ గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది.

కర్ణాటక లో అయితే ఏకంగా KGF చాప్టర్ 2 ఫుల్ రన్ కలెక్షన్స్ ని కూడా దాటేసింది..అంతే కాకుండా కన్నడ చలన చిత్ర పరిశ్రమలో కేవలం కన్నడ భాష నుండే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయిన ఏకైక సినిమా గా కాంతారా సరికొత్త చరిత్ర సృష్టించింది..రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ గ్రాస్ తో ప్రారంభమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటికి మర్చిపోలేదు.