Kanpur Man Leave Letter: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. కాపురంలో కలతలు ఇంట్లో గొడవలు లేకపోతే జీవితంలో మజాయే ఉండదు. అందుకే భార్యాభర్తలన్నాక గిల్లికజ్జాలు ఉండటం మామూలే. కానీ అందులో మరీ అధ్వానంగా దూరం పెరిగేందుకు అవకాశాలు ఉండకూడదు. ఆలుమగల మధ్య గొడవ అంటే పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్లిపోయేవిగా ఉంటే మంచిదే. కానీ పట్టింపులు ఎక్కువైతే ప్రమాదమే. తెగేదాకా లాగితే ఏదైనా తెగక మానదు. అందుకే కాపురాలు చేసుకునే వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. జీవిత భాగస్వామికి కోపం తెప్పించే క్రమంలో కాస్త తగ్గి ఉంటేనే ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో బేసిక్ శిక్షాధికారిగా షమ్షాద్ అహ్మద్ పని చేస్తున్నాడు. తన భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో ఆమె తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక రానని తెగేసి చెప్పేసింది. దీనికి ఆయన చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. తన భార్య కోసం ఆ భర్త చేసుకున్న విన్నపం వింటే మనకు కూడా గమ్మత్తుగా అనిపిస్తుంది. తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకురావడానికి తనకు మూడు రోజుల సెలవు కావాలని కోరడం వింతగా అనిపిస్తోంది.
Also Read: YSRCP MP: మహిళతో నగ్నంగా దొరికిన వైసీపీ ఎంపీ.. వైరల్ వీడియో..
పుట్టింటికి వెళ్లిన తన భార్యను బుజ్జగించి తీసుకొచ్చేందుకు మూడు రోజుల సెలవు కావాలని బాధితుడు ఉన్నతాధికారికి లేఖ రాయడం సంచలనం సృష్టించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లోకంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. ఇది కూడా అందులో ఒకటి కావడం తెలిసిందే. కట్టుకున్న భార్యను తీసుకురావడానికి మూడు రోజులు సెలవు అడగడం వింతగా తోస్తోంది. సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హల్ చల్ చేస్తోంది. షమ్షాద్ విన్నపంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎవరేమనుకున్నా తన భార్య తనకు ముఖ్యమని బాధితుడు చెబుతున్నాడు. తన భార్య అంటే తనకు ఇష్టమని అందుకే మూడు రోజులు సెలవు అడిగానని చెప్పడం గమనార్హం. మొత్తానికి ఇలాంటి గమ్మత్తైన విషయాలు కూడా చోటుచేసుకుంటాయి. భార్య కోసం మూడు రోజులు సెలవు అడగడంతో తోటి ఉద్యోగులు నవ్వుకున్నారు. భార్యను తీసుకొచ్చేందుకు అన్ని రోజులు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎవరి అవసరాలు వారికి ఉంటాయని బాధితుడు పేర్కొనడం తెలిసిందే.