https://oktelugu.com/

Nabha Natesh: అవకాశాలు లేని హీరోయిన్ దారుణంగా చూపించేస్తుంది… షార్ట్ స్కర్ట్ లో నభా నటేష్ బోల్డ్ ఫోటో షూట్!

Nabha Natesh: పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఫెయిల్యూర్ హీరోయిన్స్ ని ఎవరూ పట్టించుకోరు. టాలెంట్ ఉన్నా లేకున్నా అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. కన్నడ బ్యూటీ నభా నటేష్ కి ఆ అదృష్టం కలిసి రాక రేసులో వెనుకబడిపోయింది. 27 ఏళ్ల నభా నటేష్ 2015లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. వజ్రకాయ ఆమె మొదటి చిత్రం. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. […]

Written By: , Updated On : March 27, 2023 / 11:02 AM IST
Follow us on

Nabha Natesh

Nabha Natesh

Nabha Natesh: పరిశ్రమలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఫెయిల్యూర్ హీరోయిన్స్ ని ఎవరూ పట్టించుకోరు. టాలెంట్ ఉన్నా లేకున్నా అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. కన్నడ బ్యూటీ నభా నటేష్ కి ఆ అదృష్టం కలిసి రాక రేసులో వెనుకబడిపోయింది. 27 ఏళ్ల నభా నటేష్ 2015లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. వజ్రకాయ ఆమె మొదటి చిత్రం. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి ఆమెను టాలీవుడ్ కి తెచ్చారు. నన్ను దోచుకుందువటే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ పర్లేదు అనిపించుకుంది.

Nabha Natesh

Nabha Natesh

అనంతరం రవిబాబు ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన అదుగో మూవీలో నటించారు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఆమె కెరీర్ కి బూస్ట్ ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో కెరీర్లో ఫస్ట్ సూపర్ హిట్ నమోదు చేసింది. రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆ దెబ్బతో నభా దశ మారిపోతుందని అందరూ భావించారు. అలా జరగలేదు.

ఇస్మార్ట్ శంకర్ మూవీ అనంతరం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్… బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక నితిన్ కి జంటగా నటించిన మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఆ మూవీ నభా కెరీర్ కి ఏవిధంగానూ ఉపయోగపడలేదు.

ప్రస్తుతం నభా చేతిలో ఒక్క ప్రాజెక్ట్ లేదు. మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్లు… నభా ప్రమాదానికి గురయ్యారట. ఆమె షోల్డర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యిందట. సర్జరీ జరగడంతో కొన్నాళ్ళు మానసిక, శారీరక వేదనకు గురయ్యిందట. అందుకే సినిమాలకు గ్యాప్ వచ్చిందని చెప్పారు.

Nabha Natesh

Nabha Natesh

చర్చల దశలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని త్వరలో ప్రకటిస్తానని నభా చెబుతున్నారు. టాలీవుడ్ మేకర్స్ అయితే ఆమెను పక్కన పెట్టేసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అందాల ప్రదర్శనననే నమ్ముకున్నారు. గ్లామర్ షో చేస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్నారు. నభా తీరు చూస్తుంటే గ్లామరస్ అండ్ బోల్డ్ రోల్స్ చేయడానికైనా సిద్ధం అన్నట్లుంది. మరి ఈ ఇస్మార్ట్ బ్యూటీకి అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.