https://oktelugu.com/

Kamal Hassan Health : కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు.. హైదరాబాద్ వచ్చి వెళ్లగానే ఏమైంది.?

Kamal Hassan Health : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చూశాక ఎవరినీ ఎప్పుడు నమ్మేలా లేదు. నాడు కరోనా వేళ ఎస్పీ బాలు.. ఆ తర్వాత యువ హీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న సూపర్ స్టార్ కృష్ణ మరణాలు అభిమానులను శోకసంద్రంలో ముంచాయి. అందుకే ఇప్పుడు ఏ హీరోకు అయినా అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక అనగానే అభిమానులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. తమిళ అగ్రహీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2022 / 08:53 AM IST
    Follow us on

    Kamal Hassan Health : సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చూశాక ఎవరినీ ఎప్పుడు నమ్మేలా లేదు. నాడు కరోనా వేళ ఎస్పీ బాలు.. ఆ తర్వాత యువ హీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న సూపర్ స్టార్ కృష్ణ మరణాలు అభిమానులను శోకసంద్రంలో ముంచాయి. అందుకే ఇప్పుడు ఏ హీరోకు అయినా అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక అనగానే అభిమానులంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది.

    తమిళ అగ్రహీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడం అందరినీ షాక్ కు గురిచేసింది. నిన్ననే హైదరాబాద్ కు వచ్చిన కమల్ హాసన్ కళాతపస్వి కే. విశ్వనాథ్ ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని చాలా సేపు మాట్లాడుకున్నారు. వారి సీనీ ప్రయాణం.. ప్రస్తుత ప్రయాణంకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

    అయితే చెన్నై వెళ్లగానే కమల్ హాసన్ అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆయన జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.

    ఇటీవల కమల్ హాసన్ బర్త్ డే పార్టీ గ్రాండ్ గా సాగింది. రాధిక, కమల్ హాసన్ కలిసి వేసిన స్టెప్పులు, డ్యాన్స్ లు అందరినీ అలరించాయి. కోలీవుడ్ మొత్తం కమల్ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ సంబురం సద్దుమణగకముందే కమల్ ఇలా ఆస్పత్రి పాలవడం ఆందోళనకు గురిచేస్తోంది.

    కమల్ హాసన్ కు అస్వస్థత అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన కోలుకోవాలని తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కమల్ హాసన్ ప్రస్తుతం ‘భారతీయుడు2’తోపాటు బిగ్ బాస్ తమిళ వెర్షన్ ను హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. లోకేష్ కనగరాజ్ తో కలిసి ‘విక్రమ్2’ మూవీని రూపొందించే పనిలో పడ్డారు. ఈ టైంలో సడెన్ గా అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.