
Kalyan Ram Accident: హీరో కళ్యాణ్ రామ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ మేరకు సమాచారం అందుతుంది. ఆయన కాలికి గాయం కాగా ఆసుపత్రికి తరలించినట్లు వినికిడి. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ డెవిల్. పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓ మూవీ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. ఏకంగా 500 మంది ఫైటర్స్ ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారట. కళ్యాణ్ రామ్ మీద ఫైట్ చిత్రీకరిస్తుండగా ఆయన కాలికి దెబ్బ తగిలింది. చర్మం కొంత మేర ఊడిందట. దీంతో కళ్యాణ్ రామ్ ని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళారట.
చిన్న దెబ్బే అని అని చెప్పిన వైద్యులు చికిత్స చేసి పంపారట. వైజాగ్ లో డెవిల్ లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుండగా అక్కడ ప్రమాదం జరిగింది. స్వల్ప గాయాలతో కళ్యాణ్ రామ్ బయటపడ్డ తరుణంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డెవిల్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. బ్రిటిష్ గవర్నమెంట్ లోని భారత ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.
ఏజెంట్ చిత్ర ప్రోమోలు, కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకున్నాయి. నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. శ్రీకాంత్ విస్సా కథ అందించారు. డెవిల్ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ నడుస్తుంది. ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ కళ్యాణ్ రామ్ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇటీవల అమిగోస్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. కాన్సెప్ట్ బాగున్నప్పటికీ టేకింగ్ ఫెయిల్ కావడంతో అమిగోస్ ఆడలేదు.

అయితే బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డులకు ఎక్కింది. పరాజయాలతో ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతున్న తరుణంలో విడుదలైన బింబిసార గొప్ప విజయ నమోదు చేసింది. మల్లిడి వశిష్ట ఈ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. బింబిసార రూ. 65 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు. కీరవాణి సంగీతం అందించారు. కళ్యాణ్ రామ్ మరో వైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు.