‘Amigos’ First Review : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ మొట్టమొదటి రివ్యూ..

‘Amigos’ First Review : గత ఏడాది ‘బింబిసారా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్టకాలంలో ఉన్న టాలీవుడ్ కి ఆపద్బాంధవుడిగా మారిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘అమిగోస్’ అనే సినిమా ద్వారా ఈ నెల 10వ తారీఖున మన ముందుకి రాబోతున్నారు. ఎల్లప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపే అలవాటు ఉన్న కళ్యాణ్ రామ్, ఈసారి […]

Written By: NARESH, Updated On : February 8, 2023 9:33 pm
Follow us on

‘Amigos’ First Review : గత ఏడాది ‘బింబిసారా’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తో ఏకంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి కష్టకాలంలో ఉన్న టాలీవుడ్ కి ఆపద్బాంధవుడిగా మారిన నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది ‘అమిగోస్’ అనే సినిమా ద్వారా ఈ నెల 10వ తారీఖున మన ముందుకి రాబోతున్నారు. ఎల్లప్పుడూ కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపే అలవాటు ఉన్న కళ్యాణ్ రామ్, ఈసారి కూడా అదే తరహా కథతో మన ముందుకి రాబోతున్నాడు.

ఇందులో కళ్యాణ్ రామ్ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్ , ట్రైలర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు మెంబెర్స్ యూఏ సరిఫికేట్ ఇచ్చారు. అయితే ఈమధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ ని కొంతమంది సినీ ప్రముఖులకు , డిస్ట్రిబ్యూటర్స్ కి వేశారు. ఆ షో నుండి వచ్చిన టాక్ ఏమిటి? కళ్యాణ్ రామ్ మరోసారి భారీ హిట్ కొట్టబోతున్నాడా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం..

ఈ సినిమా ద్వారానే రాజేందర్ రెడ్డి ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయం అవ్వబోతున్నాడు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈయన మాట్లాడిన మాటల్లో మూవీ పై ఉన్న నమ్మకం ఎలాంటిదో అందరికీ అర్థమైంది. సినిమా ప్రారంభం నుండే ఆయన ఎందుకు అంత నమ్మకంతో ఉన్నాడో మనకి అర్థమైపోతోంది. సోది లేకుండా నేరుగా కథలోకి ప్రారంభం నుండే వెళ్ళిపోతాడు డైరెక్టర్. ఇక సినిమా ఒక పక్క కమర్షియల్ గా ఉంటూనే ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండేలా డైరెక్టర్ శ్రద్ద తీసుకున్నాడు.అది మనకి ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుంది..

ఇక కళ్యాణ్ రామ్ నటనే ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అట. మూడు డిఫరెంట్ షేడ్స్ లో ఆయన అద్భుతంగా నటించినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రీ రివ్యూ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుందా లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే.