
Kabzaa Collections: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరో గా తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘కబ్జా’.ఈ చిత్రాన్ని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసాడు, కన్నడ లో సూపర్ స్టార్ హోదాలో ఉన్న నటుడు కాబట్టి ఆయన అడగగానే కిచ్చా సుదీప్ మరియు శివరాజ్ కుమార్ వంటి క్రేజీ స్టార్ హీరోలు ఈ చిత్రం లో ముఖ్య పాత్రలు పోషించడానికి ఒప్పుకున్నారు.
అలా భారీ తారాగణం తో, భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం విఫలం అయ్యింది. కన్నడ సినీ పరిశ్రమ నుండి KGF సిరీస్ మరియు కాంతారా వంటి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడం తో ఈ చిత్రం కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.KGF ని చాలా చెత్తగా రీమేక్ చేసారంటూ ఘోరమైన నెగటివ్ టాక్ ని ఎదురుకుంది ఈ సినిమా.
దాంతో మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే ఈ చిత్రం బయ్యర్స్ ని నిరాశ పరుస్తూ వచ్చింది. మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా, రెండవ రోజు దాదాపుగా 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. ఆ తర్వాత మూడవ రోజు కూడా అదే రేంజ్ వసూళ్లను రాబట్టింది, అలా మూడు రోజులకు కలిపి 33 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది ఈ చిత్రం.

తెలుగు స్టేట్స్ లో మొదటి రోజు కోటి 45 లక్షలు వసూలు చెయ్యగా, రెండవ రోజు కేవలం 50 లక్షల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది, ఇక మూడవ రోజు 40 లక్షలు వసూలు చెయ్యగా మొత్తం మీద మూడు రోజులకు కలిపి 2 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. టాక్ వచ్చి ఉంటే మూడు రోజుల్లోపే వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చెయ్యాల్సిన ఈ సినిమా కేవలం 30 కోట్ల రూపాయిల మార్క్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.