Box Office Collections: పాపం యంగ్ హీరో నాగ శౌర్య టైం ఏంటో ఎవరికీ అర్థం కాదు కానీ, చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టేస్తున్నాయి.చాలా కష్టపడే తత్త్వం ఉంది, టాలెంట్ ఉంది, అందం కూడా ఉంది, కానీ అదృష్టం మాత్రం లేదు.రీసెంట్ గా ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి’ అనే సినిమా విడుదలైంది.

తన తో ‘ఊహలు గుసగుసలాడే’ వంటి సూపర్ హిట్ సినిమాని తీసిన శ్రీనివాస్ అవసరాల దీనికి దర్శకత్వం వహించడం తో, చాలా కాలం తర్వాత నాగ శౌర్య మూవీ పై ఆసక్తిని చూపించారు ప్రేక్షకులు.కానీ టీజర్ , ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదు.దానికి తోడు మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.టాక్ రాకపోతే స్టార్ హీరోల సినిమాలకు సైతం జనాలు థియేటర్స్ కి కదలని రోజులు ఇవి, అలాంటిది మీడియం రేంజ్ హీరోల సినిమాలకు ఏమి కదులుతారు.మొదటి మూడు రోజులు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తే అయ్యో పాపం అనుకుంటారు.
మొదటి రోజు ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం కోటి 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి, రెండవ రోజు టాక్ ప్రభావం చాలా గట్టిగానే పడింది.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి కేవలం 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.అలా రెండు రోజులకు కలిపి కోటి 65 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమాకి 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక మూడవ రోజు ఆదివారం అయ్యినప్పటికీ కూడా కలిసి రాలేదు, మూడవ రోజు వసూళ్లు రెండవ రోజు కంటే తక్కువ ఉన్నాయి.సుమారు గా 43 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టు సమాచారం.మొత్తం మీద మూడు రోజులకు కలిపి రెండు కోట్ల పది లక్షల రూపాయిల గ్రాస్ కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మూడు కోట్ల 45 లక్షలకు జరిగింది.ఇప్పుడు అది రికవర్ అవ్వడం అసాధ్యమే..