KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడు. దానికంటే ముందు మత బోధకుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుసు. మత బోధకుడిగా ఉన్నప్పుడు కేఏ పాల్ కు మన దేశంలోనే కాదు అమెరికా లాంటి సంపన్న దేశంలోనూ విపరీతమైన క్రేజీ ఉండేది. ఒకానొక సందర్భంలో కేఏ పాల్ ప్రపంచ దేశాధినేతలను కలిశాడు. వారితో కలిసి మాట్లాడాడు.. అయితే అటువంటి వ్యక్తి ఇప్పుడు జోకర్ అయిపోయాడు. చులకన అవుతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మీడియాలో కామెడీ పీస్ అవుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో అతడి గురించి జరుగుతున్న చర్చ.. అతని వీడియోల పై సాగుతున్న మీమ్స్ కు అంతూ పొంతూ ఉండదు.
Also Read : ఆపరేషన్ సింధూర్ కోసం ఎగబడుతున్న బాలీవుడ్
పాక్ తో యుద్ధం ఆపేస్తాడట!
కేఏ పాల్ రాజకీయ నాయకుడిగామారిన తర్వాత మాట్లాడే విషయంలో ఏమాత్రం తర్కం ఉండడం లేదు. పైగా తనను తాను దైవాంశ సంభూతుడిగా భావిస్తున్నాడు. ఆకాశానికి బోడికొండకు సంబంధం పెట్టి మాట్లాడుతున్నాడు. అందువల్లే అతడు మాట్లాడే మాటలు కామెడీ సినిమాను తలపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన మత బోధకుడిగా కేఏ పాల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన భక్త గణం ఉండేది. కానీ ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చారో.. అప్పుడే తన పరపతిని కోల్పోవడం మొదలుపెట్టారు. మత బోధకుడిగా ఉన్నప్పుడు ఆయనను చూడడానికి వచ్చిన జనం.. రాజకీయాలోకి వచ్చిన తర్వాత రావడం మానేశారు. పైగా అతడిని జోకర్ లాగా చూస్తున్నారు. ఇప్పుడిక పాకిస్తాన్ దేశంలో ఉగ్రవాద స్థావరాలపై భారత్ బుధవారం తెల్లవారుజామున దాడులు జరిపింది. త్రివిధ దళాలు చేసిన ఈ దాడుల్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతి ఒక్కరు పార్టీలతో సంబంధం లేకుండా భారత ఆర్మీకి జేజేలు పలుకుతున్నారు. తమ వంతు సంఘీభావంగా మాటలు మాట్లాడుతున్నారు. కానీ కేఏ పాల్ మాత్రం వారందరికీ భిన్నంగా మాట్లాడుతున్నారు. ఒక పని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం నగరానికి వెళ్లిన ఆయన.. అక్కడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. “పాకిస్తాన్ వెళ్తున్నాను.. యుద్ధాన్ని ఆపేస్తాను.. ఇటీవల అమెరికా వెళ్లాను. పదిమంది పెద్దల్లో 9 మందిని కలిశాను. ఒకరు మాత్రమే మిస్ అయ్యారు. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడాను. జరుగుతున్న విషయాల గురించి చర్చించాను. అమెరికా వెళ్ళినప్పుడు భారత్ – పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనేలా చూడాలని నన్ను కోరారు. దానికి కొంచెం టైం అడిగాను. ఎందుకంటే ప్రస్తుతం నాకు కొన్ని పనులు ఉన్నాయి. కోర్టులకు సెలవులు ఇస్తారు కాబట్టి.. నావి కొన్ని కేసులు ఉన్నాయి. అందువల్లే అనంతపురం వచ్చాను. ఈ కేసుల విచారణ పూర్తికాగానే.. నేను పాకిస్తాన్ వెళ్లి యుద్ధం ఆపుతానని.. రెండు దేశాల మధ్య శాంతి ఉండేలా చూస్తానని” కేఏ పాల్ వ్యాఖ్యానించాడు.. దీంతో ఒక్కసారిగా అక్కడినవారు ఘోళ్ళున నవ్వారు. కే ఏ పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.
Also Read : ఆపరేషన్ సింధూర్.. తర్వాత పాకిస్తాన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే..వీడియో వైరల్
పాకిస్తాన్ వెళ్తున్నాను.. యుద్ధాన్ని ఆపుతాను: కే.ఏ.పాల్
భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని ఆపే బాధ్యత పైన దేవుడిది.. కింద నాది
టెర్రరిస్టు క్యాంపులను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది
ఆపరేషన్ సింధూర్ ను వద్దని వారించాను
– కే.ఏ.పాల్ pic.twitter.com/RAJIvb6KGs
— BIG TV Breaking News (@bigtvtelugu) May 8, 2025