https://oktelugu.com/

Jr NTR –  Balakrishna : పుట్టినరోజు నాడు బాలయ్య ని అవమానించిన జూనియర్ ఎన్టీఆర్..ఆవేశం తో రగిలిపోతున్న ఫ్యాన్స్

ఈ ఏడాది రామ్ చరణ్, అల్లు అర్జున్ పుట్టినరోజు వచ్చినప్పుడు గుర్తుంచుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేసిన జూనియర్ ఎన్టీఆర్ , సొంత బాబాయ్ పుట్టిన రోజు ని మాత్రం విస్మరించాడని, ఇది బాలయ్య బాబు ని అవమానించడమే అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Written By:
  • Vicky
  • , Updated On : June 11, 2023 / 09:20 AM IST
    Follow us on

    Jr NTR –  Balakrishna : గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడమే అందుకు కారణం. అప్పటి నుండి ఈ ఇరువురి అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమనే రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. ట్విట్టర్ లో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని తిడుతూ పెట్టిన ఒక స్పేస్ సంచలనం గా మారింది.

    ఆ స్పేస్ ఏకంగా వైసీపీ మంత్రుల చేతికి వెళ్లి, వాళ్ళ చేత కూడా విమర్శలు చేసేలా చేసింది. ఇవన్నీ ఎన్టీఆర్ వరకు వెళ్లిందట. ఎన్టీఆర్ తల్లి ని కూడా చాలా నీచంగా దూషించారు బాలయ్య ఫ్యాన్స్. ఇవన్నీ తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ చాలా బాధపడ్డాడట. ఇదంతా చేయిస్తుంది నారా లోకేష్ టీం అని ఆయన కూడా బలంగా విశ్వసిస్తున్నాడట.

    అందుకే ఈరోజు బాలయ్య బాబు పుట్టిన రోజు కి కూడా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియచెయ్యలేదు. ఈ ఏడాది రామ్ చరణ్, అల్లు అర్జున్ పుట్టినరోజు వచ్చినప్పుడు గుర్తుంచుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేసిన జూనియర్ ఎన్టీఆర్ , సొంత బాబాయ్ పుట్టిన రోజు ని మాత్రం విస్మరించాడని, ఇది బాలయ్య బాబు ని అవమానించడమే అని అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.దీనిపై కూడా సోషల్ మీడియా లో ఈ రెండు ఫ్యాన్ బాసుల మధ్య పెద్ద రణరంగమే జరిగింది ఈరోజు.

    అయితే ఈ ఇద్దరి హీరోలను సమానంగా ఇష్టపడే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాబాయ్ మరియు అబ్బాయ్ మధ్య ఏర్పడిన ఈ గ్యాప్ ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎదో ఒకటి జరిగి మళ్ళీ ఇద్దరు ఒకటి అయిపోతే చూడాలని ఉందని కోరుకుంటున్నారు, ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ లోకి వచ్చేయాలని అంటున్నారు.మరి వాళ్ళ కోరికలు నెరవేరుతుందో లేదో చూడాలి.