
Andhrawala Re-Release: ఈమధ్య పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది..పోకిరి మరియు జల్సా సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టించేసరికి, ఇక టాప్ హీరోల కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ఇటీవల కాలం లో రీ రిలీజ్ చేసారు.కానీ ఒక్క ఖుషి రీ రిలీజ్ తప్ప మిగిలినవన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేకపోయాయి.
సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేస్తేనే పరిస్థితి ఇలా ఉంది,కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులకు కక్కుర్తి పడి డిజాస్టర్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు.గతం లో ప్రభాస్ హీరో గా నటించిన డిజాస్టర్ చిత్రం ‘రెబెల్’ ని రీ రిలీజ్ చేసారు.కనీసం ప్రింట్ ఖర్చులను కూడా రాబట్టలేకపోయింది.ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ కి మాయని మచ్చ లాంటి సినిమా ‘ఆంధ్రావాలా’ రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
సింహాద్రి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైంది.నిమ్మకూరు ప్రాంతం లో ఈ చిత్రానికి జరిగిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం వచ్చిన అశేష జనవాహినిని ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు.అంతటి భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

2004 , జనవరి 1 వ తారీఖున విడుదలైన ఈ సినిమా జనవరి 12 వ తేదికి అన్ని థియేటర్స్ లో లేపేశారు.అంత పెద్ద ఫ్లాప్ సినిమాని రీ రిలీజ్ చెయ్యాలని ఎవరైనా అనుకుంటారా..?,కానీ VJN ప్రొడక్షన్స్ అనే సంస్థ ఈ సినిమాని 4K కి మార్చి ఈ నెలలోనే రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉన్న కోపానికి ఈ సంస్థ అధినేత కనిపిస్తే కొట్టినా కొట్టేస్తారు.సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఇప్పుడు దీని గురించే చర్చ.
