https://oktelugu.com/

JR NTR: ఆ ఇమేజ్ కోసం 200 కోట్లు వదులుకున్న ఎన్టీఆర్ !

JR NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని హిందీ దిగ్గజ దర్శకులు ఆశ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ చేసిన ప్రమోషన్స్ హిందీ జనానికి బాగా నచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మాట్లాడిన విధానం, అలాగే ఎన్టీఆర్ కి ఉన్న నాలెడ్జ్ కూడా హిందీ జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలిసిన వాడే మనుషుల మనసులను గెలుస్తాడు. ఇప్పటికే ఎన్టీఆర్ హిందీ మనసులను గెలుచుకోవడంలో విజయవంతం అయ్యాడు. అయితే, ఎన్టీఆర్ కొత్తగా హిందీ సినిమాలను […]

Written By:
  • Shiva
  • , Updated On : January 4, 2022 / 10:33 AM IST
    Follow us on

    JR NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని హిందీ దిగ్గజ దర్శకులు ఆశ పడుతున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం ఎన్టీఆర్ చేసిన ప్రమోషన్స్ హిందీ జనానికి బాగా నచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మాట్లాడిన విధానం, అలాగే ఎన్టీఆర్ కి ఉన్న నాలెడ్జ్ కూడా హిందీ జనాన్ని బాగా ఆకట్టుకుంది. ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలిసిన వాడే మనుషుల మనసులను గెలుస్తాడు.

    JR NTR

    ఇప్పటికే ఎన్టీఆర్ హిందీ మనసులను గెలుచుకోవడంలో విజయవంతం అయ్యాడు. అయితే, ఎన్టీఆర్ కొత్తగా హిందీ సినిమాలను అంగీకరించే పరిస్థితిలో లేడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇంకా కట్టుబడి ఉన్నాడు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం మరో పది రోజులు డేట్లు కేటాయించనున్నాడు. అసలు ఎన్టీఆర్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ హీరో ఇలా ఒక సినిమా కోసం నాలుగేళ్ల కాలం పెట్టడం కరెక్ట్ కాదు అని కామెంట్స్ చేస్తున్నారు.

    నిజానికి ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వస్తోందని.. ఎన్టీఆర్ తో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ కావాలకున్నాడు. ఏది ఏమైనా పాన్ ఇండియా అంటే.. సినిమా బడ్జెట్ తో పాటు హీరో రెమ్యునరేషన్ కూడా మారిపోతుంది.

    ఒక్కో సినిమాకు చాలా ఈజీగా వంద కోట్ల పారితోషికం తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ అదే. అయితే, ఎన్టీఆర్ ఈ పాన్ ఇండియా అంటూ ఇప్పటికే నాలుగేళ్ల కాలాన్ని వృధా చేశాడు. నాలుగేళ్లు అంటే కనీసం నాలుగు సినిమాలు చాలా ఈజీగా చెయ్యొచ్చు.ఒక్కో సినిమాకు 50 కోట్లు వేసుకున్నా…200 కోట్ల పారితోషికం వచ్చేది.

    కానీ పాన్ ఇండియా ఇమేజ్ వస్తే.. నాలుగు సినిమాలకు సంపాదించేది ఒక్కోసారి ఒక్క సినిమాకే సంపాదించొచ్చు. కానీ పాన్ ఇండియా ఇమేజ్ రావడం అంత తేలికైన విషయం కాదు. బాహుబలితో రానాకి ఆ ఇమేజ్ రాలేదు. కానీ ప్రభాస్ కి వచ్చింది. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ కి రాదు, ఎన్టీఆర్ కి ఆ ఇమేజ్ వస్తోందని టాక్ నడుస్తోంది.

    Tags