
Jessie: బిగ్ బాస్ వేదికగా ప్రేమ కథలు, స్నేహ గీతాలు చాలా కామన్. రోజుల తరబడి ఒకే ఇంట్లో ఉండటం వలన తమ ఆలోచనలకు దగ్గర ఉన్నవాళ్ళతో రిలేషన్స్ మొదలవుతాయి. అలా ప్రతి సీజన్ కి కంటెస్టెంట్స్ లవర్స్ గా, ఫ్రెండ్స్ గా మారడం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్-సిరి లవ్ స్టోరీ హైలెట్. వీరిద్దరికీ బయట లవర్స్ ఉన్నారు. అయినా తెగించి రొమాన్స్ కురిపించారు. చాలా పొసెసివ్ గా ఉంటూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ప్రవర్తించారు. ఇది తప్పుగా వెళుతుందని కూడా వాళ్లకు తెలుసు. అందుకే హౌస్లో ఉన్న సిరిని చూసేందుకు శ్రీహాన్ రాగా… నన్ను వదిలేస్తున్నావా? అని అడిగింది.
వీరిద్దరి ఎఫైర్ ఎఫెక్ట్ దీప్తి మీద చూపించింది. ఆమె షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది. ఇదిలా ఉంటే సిరి, షణ్ముఖ్ లతో ఘాడమైన స్నేహం కొనసాగించాడు జెస్సీ. షణ్ముఖ్, సిరి, జెస్సీ చాలా సన్నిహితంగా ఉండేవారు. జెస్సీ ఎలిమినేషన్ డే నాడు షణ్ముఖ్, సిరి బాగా ఫీల్ అయ్యారు. అయితే బయటకు వచ్చాక ఏం జరిగిందో తెలియదు కానీ… జెస్సీని సిరి, షణ్ముఖ్ దూరం పెట్టారట. తాజా ఇంటర్వ్యూలో జెస్సీ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
నన్ను వాళ్లు దూరం పెట్టారు. కారణం ఏమిటో తెలియదు. నేను ఏదైనా తప్పు చేశానని తెలిస్తే నేరుగా అడిగే స్వేచ్ఛ వాళ్లకు ఉంది. ఒకసారి స్నేహం చేశాక అంత తేలికగా బ్రేక్ ఎలా చేసుకుంటారో నాకు అర్థం కాలేదు. నిజానికి గతంలో వాళ్ళను ఛీ కొట్టిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ వెళుతున్నారు. బిగ్ బాస్ హౌస్లో షణ్ముఖ్ నన్ను అభిమానించాడు. నన్ను బాగా నమ్మాడు. నా కోసం ఏడ్చాడు. నాలుగో వారం జైలులో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు. షణ్ముఖ్ పిచ్చోడు కాదు. పక్కన ఉన్న పర్సన్ ఫేక్ అనిపిస్తే దూరం పెట్టేస్తాడు. నేను జెన్యూన్ కాబట్టే నాతో స్నేహం చేశాడు.

అలాంటిది ఇప్పుడు నేను ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. నేను ఫేమస్ కావాలని వాళ్ళను వాడుకుంటున్నాని కొందరు అంటున్నారు. నాకు ఆ అవసరం లేదు. షణ్ముఖ్ మాట్లాడతాడని నేను ఏడాది వెయిట్ చేశాను. కలిసి ప్రాబ్లమ్ ఏమిటని అడిగాను.నన్ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశాడు. ఒక దశకు వచ్చాక నాకు కూడా విసుగొచ్చేసింది. వాళ్ళు నన్ను వద్దనుకున్నప్పుడు నాకు కూడా వాళ్ళు వద్దనుకున్నాను… అంటూ జెస్సీ చెప్పుకొచ్చాడు. అసలు జెస్సీ ని షణ్ముఖ్, సిరి ఎందుకు దూరం పెట్టారనేది తెలియదు.