
India Vs Australia 3rd Test Steve Smith: ఇండోర్ లో జరిగిన మూడో టెస్టులో భారత జట్టును చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియాపై ఆ జట్టు మాజీ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా అద్భుతమైన క్రికెట్ ఆడిందని మెచ్చుకుంటున్నారు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో భారత జట్టుపై జయభేరి మోగించింది. స్మిత్ నాయకత్వంలో ఒకప్పటి ఆస్ట్రేలియా జట్టు కనిపించిందని మాజీ క్రికెట్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Jessie: వాడు పిచ్చోడు కాదు ఫేక్ అనిపిస్తే వదిలేస్తాడు… సిరి,షణ్ముఖ్ లపై జెస్సీ షాకింగ్ కామెంట్స్
ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా బాగా ఆడిందని మాజీ క్రికెటర్లు చెబుతున్నారు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు పూర్తి జవసత్వాలు సంపాదించుకుంది.. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా ఎలా ఆడాలో అలా ఆడింది.. స్మిత్ కెప్టెన్ కాగానే ఆస్ట్రేలియా జట్టులో వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కమిన్స్ స్వదేశానికి వెళ్లడం.. రెండు టెస్టులు ఓడిపోయిన నేపథ్యంలో జట్టులో స్మిత్ ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.. అదే ఇండోర్ లో జట్టు గెలిచేందుకు దోహదపడింది. ఇక ఇండోర్ లో భారత్ టాస్ గెలిచినప్పటికీ ప్రతి సెషన్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. మొదటి రోజు నుంచే అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు తీసి భారత జట్టుపై తీవ్రమైన ఒత్తిడి పెంచింది. అయితే కెప్టెన్ స్మిత్ లయాన్ మాత్రమే కాకుండా కూనేమాన్, ముర్ఫీ ని రంగంలోకి దించాడు. వారు వైవిధ్యంగా బంతులు వేయడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ త్వరగా చేరుకున్నారు.. వైపు ఫీల్డింగ్ ను మోహరించడంలో స్మిత్ విజయవంతమయ్యాడు.. అంతేకాదు ఫీల్డింగ్ లో అతను కూడా తురుపు ముక్కలాగా మెరిశాడు. ముఖ్యంగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో పుజారా కొట్టిన బంతిని క్యాచ్ అందుకున్న విధానం హై లైట్ గా నిలిచింది.. ఇదే మ్యాచ్ ను మలుపు తిప్పింది. పూజార ఔట్ అవ్వకపోయి ఉంటే భారత్ ఇంకొన్ని పరుగులు చేసి ఉండేది.
నిశ్శబ్దంగా ఉన్నాడు
భారత్ విధించిన 75 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు పరుగులు ఏమి చేయకుండానే ఖవాజా వికెట్ కోల్పోయింది. దీంతో మ్యాచ్లో అద్భుతం జరుగుతుందేమో అని అందరూ అనుకున్నారు..కానీ హెడ్, లాబుస్ చాగ్నే నింపాదిగా ఆడారు.. వీళ్లు మైదానంలో ఆడుతున్నంతసేపు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న స్మిత్ నిశ్శబ్దంగా ఉన్నాడు. మధ్య మధ్యలో తనలో తాను ఏదో పాట పాడుకున్నట్టు కనిపించాడు.

హెడ్ బౌండరీ సాధించినప్పుడు స్మిత్ చప్పట్లు కొట్టాడు.. ఈ ఆనందాన్ని తన పక్కనే ఉన్న ఖవాజాతో పంచుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ లో స్మిత్ చెస్ గ్రాండ్ మాస్టర్ లాగా కనిపించాడు.. అంతకుముందే తన ఎత్తులతో భారత జట్టును చిత్తు చేశాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు.. భారత్ మొదటి, రెండో ఇన్నింగ్స్ ల్లో ఒక్కో బ్యాట్స్ మెన్ కు ఒక్కో ప్రణాళిక అమలు చేశాడు.. దీనికోసం ఐదుగురు బౌలర్లను ఉపయోగించుకున్నాడు.. తన దీర్ఘకాలిక శత్రువైన పూజారను కూడా తన మాస్టర్ ప్లాన్ తో బురిడీ కొట్టించాడు.. అందుకే ఇండోర్లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది.. అంతకుముందు నాగ్ పూర్ లో ఇన్నింగ్స్ ఓటమికి బదులు తీర్చుకుంది.. ఇక స్మిత్ ఆట తీరుపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా ఇండియా మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.. ఇక చివరిదైన నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ లో జరగనుంది.
Also Read:Rashmi Gautam: ఆధారాలతో రష్మీ బాగోతం బయటపెట్టిన నెటిజన్… తప్పు చేశానని ఒప్పేసుకున్న స్టార్ యాంకర్!