Jayasudha Third Marriage: జయసుధ తన వయసున్న అజ్ఞాతవ్యక్తితో తరచుగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మూడో వివాహం చేసుకున్నారన్న వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ వార్తలపై జయసుధ స్పందించారు. ఆ వ్యక్తి ఎవరో? తనతో ఎందుకు ఉన్నారో? వివరణ ఇచ్చారు. జయసుధ భర్త నితిన్ కపూర్ 2017లో ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. డిప్రెషన్ కారణంగా నితిన్ కపూర్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నితిన్ కపూర్ నిర్మాతగా కాగా… జయసుధను 1985లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

కొన్నాళ్లుగా ఆయన జయసుధ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. జయసుధ పిల్లలతో పాటు హైదరాబాద్ లో ఉంటే నితిన్ కపూర్ ముంబైలో తన సిస్టర్ తో పాటు ఉంటున్నారు. ఆయన మరణించిన ఐదేళ్లు దాటిపోయింది. నితిన్ కపూర్ కంటే ముందు ఒక తెలుగు వ్యక్తిని జయసుధ వివాహం చేసుకున్నారు. ఆయనతో మనస్పర్థలు వచ్చి విడిపోయారు. రెండో భర్త నితిన్ కపూర్ మరణించిన ఇన్నేళ్ళ తర్వాత మూడో పెళ్లి వార్తలు రావడం సంచలనంగా మారింది.
కాగా ఈ వార్తలపై జయసుధ స్పందించారు. జయసుధ మాట్లాడుతూ… నాతో ఉన్న వ్యక్తి పేరు ఫెలిపే. ఆయన ఓ మూవీ మేకర్. అమెరికా నుండి వచ్చారు. ఒక మూవీ విషయమై మేము కలుసుకోవడం జరిగింది. ఫెలిపే బయోపిక్ బేస్డ్ చిత్రాలు చేస్తారు. బయోపిక్స్ భిన్నమైన కోణంలో ప్రెజెంట్ చేస్తారు. నా బయోపిక్ తెరకెక్కించాలని ఆయన అనుకుంటున్నారు. దీని కోసమే నన్ను కలిశారు. నా జీవితంలోని అన్ని కోణాలు ఆయన ఆ బయోపిక్ లో చూపించనున్నారు. ఆయన కేవలం ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి మా మధ్య ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

కాగా 70లలో స్టార్ హీరోయిన్ గా జయసుధ వెలిగిపోయారు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానం కలిగి ఉన్నారామె. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమెది సక్సెస్ ఫుల్ కెరీర్. సహజ నటి అనే బిరుదు ఆమె సొంతం. అమ్మ, అత్త పాత్రలకు పెట్టింది పేరు. నటుడు ప్రకాష్ రాజ్ తో ఆమెది సూపర్ హిట్ కాంబినేషన్. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో జయసుధ-ప్రకాష్ రాజ్ ల జంట ప్రేక్షకులను అలరించారు.