Janhvi Kapoor- Vijay Devarakonda Mother: టాలీవుడ్ లోకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే స్టార్ హీరో రేంజ్ స్టేటస్ ని దక్కించుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు సినిమాతో హీరో గా మొదటి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం వంటి సినిమాలతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకున్నాడు..ఇప్పుడు విజయ్ దేవరకొండ కి హిట్టు మరియు ఫ్లాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి..విజయ్ దేవరకొండ కి కేవలం టాలీవుడ్ లోనే కాదు..పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ మరియు క్రేజ్ ఉంది..ముఖ్యంగా లేడీస్ ఆయనంటే వెర్రెత్తిపోతార

వారిలో శ్రీదేవి కూతురు /ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒకరు..బాలీవుడ్ లో అంతమంది సెక్సీ హీరోలు ఉన్నప్పటికీ తన క్రష్ విజయ్ దేవరకొండ అంటూ జాన్వీ కపూర్ ఎన్నో ఇంటర్వూస్ లో తెలిపింది..ఛాన్స్ వస్తే అతనితో ఉచ్చితంగా సినిమా చెయ్యమన్నా చేసేస్తాను అంటూ ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది.
ఇది ఇలా ఉండగా లేటెస్ట్ జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ వాళ్ళ అమ్మతో ఫోటో దిగుతూ సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ తెగ వైరల్ గా మారింది..ఈ ఫోటో ని చూసిన అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..అసలు వీళ్ళ మధ్య ఏమి జరుగుతుంది..? అనే సందేహాలు వ్యక్తం చేసారు..అసలు విషయానికి వస్తే జాన్వీ కపూర్ లేటెస్ట్ గా హైదరాబాద్ కి వచ్చిందట..ఈ సందర్భంగా ఆమె విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లిందని..ఆ సమయం లో తీసుకున్న ఫోటో ని చేసారని విజయ్ దేవరకొండ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన లైగర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఫ్లాప్ గా నిలిచిందో తెలిసిందే..అయ్యినప్పటికీ ఖుషి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.