Janhvi Kapoor Bikini : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై శ్రీదేవి ఒక ప్రభంజనం. సౌత్ లో మొదలైన ఆమె ప్రస్థానం దేశవ్యాప్తమైంది. బాలీవుడ్ కి వెళ్లి అక్కడి టాప్ హీరోయిన్స్ కి ఎసరు పెట్టారు. రెండు తరాల హిందీ స్టార్స్ శ్రీదేవితో ఆడిపాడారు. శ్రీదేవి వెండితెర విజయాలు, ఆమె అందుకున్న మైలురాళ్లు గురించి వర్ణించాలంటే రోజుల సమయం పడుతుంది. అలాంటి లెజెండ్ వారసురాలైన జాన్వీ కపూర్ తల్లి లెగసీని ముందుకు తీసుకెళ్లే సూచనలు కనిపించడం లేదు. కొద్దోగొప్పో అమ్మ పోలికలతో పుట్టిన జాన్వీ… వెండితెరపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుంది.

జాన్వీ పరిశ్రమకు వచ్చి నాలుగేళ్లు దాటిపోయింది. ఒక్క కమర్షియల్ హిట్ లేదా క్లాసిక్ పడలేదు. అసలు హీరోయిన్ అని గుర్తింపు తెచ్చే మూవీలో నటించలేదు. జాన్వీ చిత్రాలు వస్తున్నాయి, పోతున్నాయి. జాన్వీ మూవీ అని చెప్పుకునేలా ఒక్క చిత్రం ఉండటం లేదు. కపూర్ ఫ్యామిలీ అండ ఉండి కూడా ఈ స్టార్ కిడ్ తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. జాన్వీ దృష్టి మొత్తం సోషల్ మీడియా, ఫోటో షూట్స్ పైనే ఉంటుంది.

సిల్వర్ స్క్రీన్ ని ఎలా ఏలాలో ఆలోచించడం వదిలేసి ఇంస్టాగ్రామ్ నుండి వచ్చే చిల్లర కోసం వెంపర్లాడుతుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ని పెంచుకోవడం. వ్యాపార ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తూ కాలం గడిపేస్తుంది. కేవలం అందాలు ఆరబోత, గ్లామర్ విందుతో ఫేమ్ వస్తుందని భ్రమ పడుతుంది. కేవలం అందాలతో అందలం ఎక్కాలి అనుకుంటే, జాన్వీ కంటే సుందరాంగులు ఎందరో ఉన్నారు. మొహమాటం లేకుండా టాప్ టూ బాటమ్ చూపించే బోల్డ్ హీరోయిన్స్ ఉన్నారు.
కనీసం రోజుకో ఫోటో షూట్ చేస్తుంది జాన్వీ కపూర్. నిండైన బట్టల్లో జాన్వీ కనిపించిన సందర్భాలు తక్కువ. అసలు బట్టలంటే చిరాకు అన్నట్లు అమ్మడు తీరుంటుంది. పబ్లిక్ ప్రదేశాల్లో పొట్టి డ్రాయర్లు వేసుకొని తిరుగుతారు. జాన్వీ ఫోటోల కోసం ముంబై ఫోటోగ్రాఫర్స్ జిమ్ దగ్గర కాపు కాచుకొని కూర్చుంటారు. వాళ్ళు ఆమె అందాలను బంధించి, వాటిని పెట్టుబడిగా పెట్టి ఏదో ఒక రూపాయి సంపాదించుకుంటారు.

తాజాగా ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రమోషన్ కోసం జాన్వీ బికినీ ఫోటోలు షేర్ చేసింది. ఒంటికి హత్తుకున్న బికినీలో సర్వాంగ దర్శనం ఇచ్చింది. బికినీలో జాన్వీని చూసి కుర్రాళ్ళు ఈ రోజు నిద్ర కరువే అంటున్నారు. జాన్వీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది. జాన్వీ గ్లామర్ కి అలవాటు పడ్డ జనాలు నువ్వు తగ్గొద్దని ఎంకరేజ్ చేస్తున్నారు. సాంప్రదాయ వాదులు మాత్రం, ఇదేం అరాచకం అంటూ ముఖం చిట్లించుకుంటున్నారు.