Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: నమ్మకాన్ని కోల్పోయిన జగన్.. వైసీపీ డ్యామేజ్ కి కారణం అదే..!

CM Jagan: నమ్మకాన్ని కోల్పోయిన జగన్.. వైసీపీ డ్యామేజ్ కి కారణం అదే..!

CM Jagan
CM Jagan

CM Jagan: రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న నాయకుల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే రకం కొందరిది అయితే.. ఆ మాటను అప్పటికే పరిమితం చేసి మర్చిపోయే రకం మరికొందరిది. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిని మొదటి రకానికి చెందిన నాయకుడుగానే ఆ పార్టీ నాయకులతోపాటు ప్రతిపక్ష నాయకులు కూడా అంగీకరిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండగా తనకు అండగా నిలిచిన ఎంతోమందికి పిలిచి పదవులను కట్టబెట్టిన ఘనత ఆయనకు దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం ఆ స్థాయిలో ఆ పార్టీ నాయకులకు ఉండేది. కాబట్టి 2019 ఎన్నికల్లో 151 పైగా స్థానాల్లో విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నారన్న భావన ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.

డబ్బే ప్రధానంగా సాగుతున్న రాజకీయాలు..

ఒకప్పుడు రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు మంచి, సేవాగుణం కలిగి ఉండేవాళ్లు. అటువంటి వారికే ప్రజలు ఓట్లు వేసి గెలిపించేవారు. అయితే మారుతున్న రాజకీయాలు, ప్రజల ఆలోచన విధానాలు కారణంగా ప్రస్తుత రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయి. ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలరు అని చూసి పార్టీ టికెట్లను కేటాయిస్తున్నారు. ఈ తరహా విధానానికి గత ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నమ్మకానికి ప్రాధాన్యత కల్పిస్తూ సీట్లను కేటాయించారు. గడిచిన తొమ్మిదేళ్లుగా తనతో పాటు ఉంటూ కష్టనష్టాలు ఎదుర్కొన్న ఎంతోమందికి ఉన్నత పదవులను సీఎం జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. వీరిలో రూపాయి ఖర్చు పెట్టే స్తోమత లేని ఎంతోమంది ఎమ్మెల్యేలు, విజయం సాధించారు. వీరిలో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్, తిరుపతి ఎంపీ గురుమూర్తి వంటి వాళ్లు ఉదాహరణగా చెప్పవచ్చు. మరి ఎంతో మందికి నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ సీఎం జగన్మోహన్ రెడ్డి అప్పగించారు.

151 సీట్లు విజయం ఆ నమ్మకం వలనే..

సీఎం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న నాయకులకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంతే మేలు చేస్తూ వచ్చారు. ఆ పార్టీ నాయకులతోపాటు ప్రజలు బలంగా నమ్మడం వల్లే 50 శాతానికి పైగా ఓట్లతో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట మీద నిలబడతారని, ఆయన మాట ఇస్తే ఎంతవరకైనా వెళ్తారు అన్న భావన పార్టీ నాయకులతో పాటు ప్రజలు నమ్మరు కాబట్టే అఖండ విజయాన్ని అందించారు. అయితే ఆ నమ్మకంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నట్లు కనిపిస్తోంది.

నమ్మకాన్ని కోల్పోవడం వల్లే డ్యామేజ్..

2019 ఎన్నికల వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రజలు, ఆ పార్టీ నాయకులు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రస్తుతం కోల్పోతున్నట్లు చెబుతున్నారు. ఆ నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి కోల్పోవడం వల్లే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేయి దాటిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు చేయి దాటి వెళ్లిపోగా, మరో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు అదే బాటలో పయనించే అవకాశము ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ఓటమికి, తాజాగా ఎమ్మెల్యేలు చేయి దాటి పోవడానికి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న నమ్మకం ప్రజలకు, నాయకులకు పోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

CM Jagan
CM Jagan

సర్వేల ఫలితంగానే చర్యలు..

వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 50 మంది వరకు సీట్లు కోల్పోవచ్చు అన్నది వైసీపీలో జోరుగా సాగుతున్న చర్చ. సీట్లు ఇవ్వకపోతే ఆ పార్టీలో ఎందుకు ఉండాలన్న భావంతోనే చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. వచ్చే ఆలోచనను మరి కొంతమంది చేస్తున్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం తనను నమ్ముకుంటే మేలు చేస్తానని చెబుతున్నారు. గతంలో ఆయన మాటలను నమ్మి ఎంతోమంది సీట్లను త్యాగం చేశారు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగారు. కానీ ఇప్పుడు ఆయన మాటలను నమ్మకుండా చాలామంది బయటకు వెళ్లి పోవాలని భావిస్తున్నారు. దీంతో పార్టీకి డామేజ్ కలుగుతుంది అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్న సర్వేల ఫలితాల ఆధారంగా టికెట్ల కేటాయింపు అన్నది ఇప్పుడు వైసీపీలో ముసలానికి దారి తీయొచ్చు అని పలువురు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular