Mahesh Babu Mother Death: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కృష్ణ భార్య ఈ లోకాన్ని విడిచి వెళ్లాకు. కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంతకాలంగా ఇందిరా దేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. ఆరోగ్యం క్షీణించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4 గంటలకు ఇందిరా దేవి తుదిశ్వాస విడిచారు.

కాగా ఈ ఏడాది జనవరిలోనే కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూశారు. ఈ ఘటన మరువక ముందే కృష్ణ కుటుంబంలో మరో విషాదం అలుముకుంది.
పెద్ద కుమారుడు రమేశ్ బాబు మృతితో ఇందిరాదేవి కృంగిపోయింది. ఈ నేపథ్యంలోనే అతడి ఆలోచనలతోనే ఆరోగ్యం దెబ్బతిన్నది. నాటి నుంచి బయటకు కాకుండా మానసిక వేధనకు గురైన ఇందిరాదేవి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.
కృష్ణ గారిని ఇందిరాదేవి 1961 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాత కృష్ణ తన రెండో పెళ్లిని విజయ నిర్మలను చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇందిరా దేవి నిరాకరించారు. అయినా కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకొని వేరుగా ఉన్నారు. మూడేళ్ల క్రితం విజయ నిర్మల సైతం మరణించింది.
కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు మహేష్ బాబు , రమేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం. మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.