https://oktelugu.com/

Jabardasth Kiraak RP Engagement Photos: ప్రేమించిన అమ్మాయితోనే కిరాక్ ఆర్పీ ఎంగేజ్ మెంట్.. ఆమె ఎవరో తెలుసా?

Jabardasth Kiraak RP Engagement Photos: కిరాక్ ఆర్పీ.. రాయలసీమ స్లాంగ్ లో ఈ జబర్ధస్త్ కమెడియన్ చేసే కామెడీ అందరికీ చిరపరిచితమే. జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కమెడియన్ ప్రస్తుతం స్టార్ మా టీవీలో ‘కామెడీ స్టార్స్’ లో నవ్విస్తున్నాడు. చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. పలు కారణాల వల్ల ఇతడి పెళ్లి ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు తాను చేసుకోబోయే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాకిచ్చాడు ఆర్పీ అలియాస్ రాంప్రసాద్. ఇన్నాళ్లుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2022 / 06:52 PM IST
    Follow us on

    Jabardasth Kiraak RP Engagement Photos: కిరాక్ ఆర్పీ.. రాయలసీమ స్లాంగ్ లో ఈ జబర్ధస్త్ కమెడియన్ చేసే కామెడీ అందరికీ చిరపరిచితమే. జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ కమెడియన్ ప్రస్తుతం స్టార్ మా టీవీలో ‘కామెడీ స్టార్స్’ లో నవ్విస్తున్నాడు. చాలా రోజులుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా.. పలు కారణాల వల్ల ఇతడి పెళ్లి ఆలస్యం అవుతోంది. ఎట్టకేలకు తాను చేసుకోబోయే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని అందరికీ షాకిచ్చాడు ఆర్పీ అలియాస్ రాంప్రసాద్.

    ఇన్నాళ్లుగా తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీప్రసన్నను వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించి ఆర్పీ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. వీరి నిశ్చితార్థం బుధవారం సాయంత్రం వేడుకగా జరిగింది. ఆర్పీ నిశ్చితార్థానికి జబర్ధస్త్ నటులతో పాటు సినీ తారలు నాగబాబు, శివాజీ, కృష్ణభవాన్, అన్నపూర్ణ, హేమ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

    ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తనదైన శైలిలో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించించే ఆర్బీ తన యూట్యూబ్ చానల్ వేదికగానూ సందడి చేస్తున్నారు. ‘వజ్ర కవచధర గోవింద’, ఇదేం దెయ్యం, ఎంఎంఓఎఫ్ తదితర చిత్రాల్లో నటించాడు.

    ప్రస్తుతం మాటీవీలో ‘కామెడీ స్టార్స్’ ప్రోగ్రాంలో కమెడియన్ గా కొనసాగుతున్నాడు. ఇక ఎప్పటి నుంచో తను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను అందరినీ ఒప్పించి మెప్పించి మరీ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమె పేరు లక్ష్మీ ప్రసన్న.

    హైదరాబాద్ కు వచ్చి ఆర్పీ సినీ, టీవీ అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు లక్ష్మీప్రసన్ననే తోడుగా నిలిచిందని ఆర్పీ ఒకానొక సందర్భంలో తెలిపాడు. ఇప్పుడు తనకు సపోర్టుగా నిలిచిన ఆమెనే ఆర్పీ వివాహం చేసుకున్నాడు.

    Recommended Videos: