https://oktelugu.com/

Jabardasth: షాకింగ్.. జబర్ధస్త్ కు సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ టీం గుడ్ బై!

Jabardasth:ఎన్ని షోలు వచ్చినా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో ‘జబర్ధస్త్’. ఈ షో మొదలైనప్పుడు ఇంత హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ షో నుంచే ఎంతో మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇందులో నటించిన కమెడియన్లు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. ఎంతోమంది కమెడియన్స్, జడ్జీలు వచ్చి వెళ్లినా జబర్ధస్త్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురు స్టార్ కమెడియన్స్ ఈ షోకు గుడ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 08:15 AM IST
    Follow us on

    Jabardasth:ఎన్ని షోలు వచ్చినా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో ‘జబర్ధస్త్’. ఈ షో మొదలైనప్పుడు ఇంత హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ షో నుంచే ఎంతో మంది కమెడియన్స్ పుట్టుకొచ్చారు. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇందులో నటించిన కమెడియన్లు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు.

    sudigali-sudheer-team

    ఎంతోమంది కమెడియన్స్, జడ్జీలు వచ్చి వెళ్లినా జబర్ధస్త్ మాత్రం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురు స్టార్ కమెడియన్స్ ఈ షోకు గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది.

    గత కొన్నేళ్లుగా జబర్ధస్త్ లో నంబర్ 1 కమెడియన్లుగా కొనసాగుతూ నడిపిస్తున్న సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ లు జబర్ధస్త్ ను వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ షో ద్వారా ఒక సినిమా హీరో స్తాయికి ఎదిగాడు సుడిగాలి సుధీర్. వెరైటీ గెటప్ లు, కామెడీ టైమింగ్, రష్మీతో రోమాన్స్ తో ఆడియెన్స్ కు చాలా దగ్గరయ్యాడు. నెంబర్ 1 టీవీ స్టార్ గా మారాడు. ఈ క్రమంలోనే వీరు ముగ్గురు వీడిపోతున్నట్టు ప్రకటించారు.

    Also Read: Lakshya Movie: నాగశౌర్య “లక్ష్య “సినిమాకు యూ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్…

    వచ్చే వారానికి సంబంధించిన ఎక్స్ ట్రా జబర్ధస్త్ ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఇందులో వేదికపైనే సుడిగాలి సుధీర్, గెటప్ శీను, రాంప్రసాద్ లు జబర్ధస్త్ ను వీడుతున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన విని జడ్జి రోజా, మను సహా అందరూ షాక్ అయ్యారు. తాము ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఈ విషయాన్ని చెప్పాలనుకున్నామని.. కానీ ఈ వేదికపై చెప్పాల్సి వస్తుందని సుధీర్, శీను, రాంప్రసాద్ తెలిపారు. ‘మమ్మల్ని క్షమించండి.. ఇంతకాలం ఆదరించినందుకు కృతజ్ఞతలు’ అని జబర్ధస్త్ టీం సభ్యులు వీడ్కోలు పలికారు.

    అయితే వీరు నిజంగానే జబర్థస్త్ నుంచి వెళ్లిపోతున్నారా? లేదంటే ప్రోమో కోసం ఇలా చేశారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే నిజంగా సుధీర్ టీం కనుక జబర్ధస్త్ వీడితే ఇక ఆ షో ను ఎవరూ చూడరని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

    Also Read: Samantha: విడాకుల అనంతరం మొదటిసారి తన మనసులో మాట చెప్పిన సమంత…

    ప్రోమో