
Jabardasth Comedian జబర్దస్త్ షోలో అడల్ట్ కంటెంట్ పాళ్ళు ఎక్కువవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంకర్ రష్మీ దారుణమైన పంచ్ డైలాగ్స్ తో రెచ్చిపోతుంది. గత ఎపిసోడ్ లో పిల్లలు పుట్టాలంటే కంచాలు కాదు మంచాల దగ్గరగా ఉండాలని పచ్చి బూతు మాట్లాడింది. తాజా ఎపిసోడ్లో ఒక కమెడియన్ బ్లూఫిల్మ్స్ చూస్తున్నాడంటూ పబ్లిక్ లో బండారం బయట పెట్టింది. ఈ గురువారం ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల చేశారు. బుల్లెట్ భాస్కర్ ఇంద్ర మూవీ స్పూఫ్ తో స్కిట్ చేశాడు. ఆవేశం స్టార్ ని చిరంజీవిగా, వర్షను ఆర్తి అగర్వాల్ గా చూపించాడు. ఇమ్మానియేల్ దుబాయ్ షేక్ గెటప్ వేశాడు.
బుల్లెట్ భాస్కర్ కమెడియన్ ఇమ్మానియల్ ని ఉద్దేశిస్తూ… సినిమా పూర్తయ్యింది. రెండు వందల కోట్లు వస్తాయి నాలుగు పెట్రోల్ బావులు కొనచ్చు. దుబాయ్ లో ఉంది ఏందంది?’ అని తడుముకున్నాడు. ఇమ్మానియేల్ అందుకుని బూర్జ్ ఖలీఫా అని అన్నాడు. మళ్ళీ వర్షను చూపిస్తూ… మియా ఖలీఫా అన్నాడు. ఇమ్మానియేల్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పేరు చెప్పగానే, రష్మీ రియాక్ట్ అయ్యింది. ఇమ్మానియేల్ ఈ మధ్య ఆమె వీడియోలు బాగా చూస్తున్నావు, అంది.

రష్మీ కామెంట్ కి స్పందనగా… ఏం మాట్లాడుతున్నారు. నేను సబ్స్క్రైబర్ అంటూ షాకింగ్ పంచ్ వేశాడు. నీలి చిత్రాలు చూస్తున్నావని రష్మీ ఆరోపణ చేయగా, అవునని ఇమ్మానియల్ ఒప్పుకున్నాడు. ఇది దారుణ పరిణామం అని ఆడియన్స్ వాపోతున్నారు. మొదట్లో జబర్దస్త్ అడల్ట్ కంటెంట్ షోగా పేరు తెచ్చుకుంది. ఒక దశలో వల్గర్ డైలాగ్స్ ఎక్కువ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ పచ్చి బూతు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వద్దని కమెడియన్స్ కి నిబంధనలు పెట్టారు.
ఈ మధ్య మరలా అడల్ట్ కంటెంట్ ని నమ్ముకొని షోలు చేస్తున్న భావన కలుగుతుంది. కారణం… ఒకప్పటి ఆదరణ జబర్దస్త్ కి ఇప్పుడు లేదు. జడ్జెస్, టీం లీడర్స్, యాంకర్స్ తప్పుకోవడంతో అంతా కొత్త సరుకు దిగారు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర స్థాయి కామెడీ వాళ్ళ వల్ల కావడం లేదు. హైపర్ ఆది రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. అనసూయ ఇటీవల జబర్దస్త్ టార్గెట్ గా దారుణ కామెంట్ చేసింది. చెత్త టీఆర్పీ స్టంట్స్ పోతే కానీ మరలా బుల్లితెరకు రానంటూ తన అసహనం బయటపెట్టారు. రాను రాను మరింత వల్గర్ కామెడీ జబర్దస్త్ లో దర్శనమిస్తుందేమో అనే భయం వేస్తుంది.