
Manchu Manoj: మోహన్ బాబు కుమారులు మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జరుగుతుంది. మనోజ్ స్వయంగా ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడం సంచలనమైంది. సదరు వీడియోలో మనోజ్ అన్నయ్య విష్ణు మీద ఆరోపణలు చేశారు. నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్ అంటూ ఆ వీడియోలో మనోజ్ మాట్లాడటం రికార్డు అయ్యింది. ఆగ్రహంగా ఉన్న విష్ణును కొందరు సముదాయిస్తున్నారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు అంటూ… కథనాలు వెలువడ్డాయి.
ఈ గొడవల నేపథ్యంలో మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతూ మనోజ్ ట్వీట్ చేశారు. ఇది అత్యంత బాధాకరం అంటూ సానుభూతి తెలియజేశారు. అయితే ట్వీట్ కాంటెక్స్ట్ తో సంబంధం లేకుండా… మనోజ్ మీద నెటిజన్స్ ప్రశ్నల దాడికి దిగారు. అన్నయ్య విష్ణుతో గొడవేంటి? మీ మధ్య సమస్య ఏంటి? అని కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు మోహన్ బాబు ఈ వివాదంపై చాలా సీరియస్ గా ఉన్నారట. ఇద్దరి కొడుకులకు క్లాస్ పీకడంతో పాటు, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారట. మనోజ్-విష్ణుతో మీటింగ్ పెట్టి ఒక ఒప్పందానికి రానున్నారని సమాచారం. ఇక మంచు ఫ్యామిలీలో వివాదాలకు ఆర్థిక విషయాలే కారణం అంటున్నారు. ఆస్తుల పంపకంలో మనోజ్-విష్ణు మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయని వినికిడి.
కాగా మనోజ్ మార్చి 3న రెండో వివాహం చేసుకున్నారు. భూమా మౌనికతో ఆయనకు పెళ్లి జరిగింది. ఈ వివాహాన్ని మొదటి నుండి విష్ణు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలను బలపరుస్తూ విష్ణు మనోజ్ పెళ్లిలో కనిపించలేదు. మోహన్ బాబు కూడా చివరి నిమిషంలో దర్శనమిచ్చారు. ఇక మౌనిక మొదటి భర్త కుమారుడి బాధ్యత నాదే అని మనోజ్ ప్రకటించారు. ఇది కూడా గొడవలకు ఒక కారణం కావచ్చు. వెరసి మనోజ్-విష్ణు మధ్య వార్ తీవ్ర రూపం దాల్చింది. మోహన్ బాబు ఫ్యామిలీతో చాలా కాలంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి మీద విష్ణు దాడి చేయడాన్ని మనోజ్ ఖండించారు.
Saddened to learn the passing away of #PSMani garu, May the departed soul rest in peace. 🙏
My deepest condolences to #Ajith garu and the entire family in this hour of grief.— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 24, 2023