https://oktelugu.com/

చిరు మళ్లీ పుట్టాడు.. మగబిడ్డకు జన్మినిచ్చిన మేఘనారాజ్..!

చిరంజీవి సర్జా-మేఘనా రాజ్ దంపతులు శాండిల్ వుడ్లో బెస్ట్ కపుల్. వీరిద్దరు పదేళ్లకుపైగా ప్రేమించుకొని మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. మేఘానా రాజ్ గర్భవతిగా ఉన్న సమయంలో చిరంజీవి సర్జా(36) గుండెపోటుతో హఠన్మారణం చెందాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. Also Read: పవన్ కోసం కథను ఫైనల్ చేసిన బండ్ల ! 36ఏళ్లకే చిరంజీవి సర్జా మృతిచెందాడంతో మేఘానా రాజ్ ఒంటరైంది. భర్తలేకపోవడంతో ఆమె కుంగిపోగా కుటుంబ సభ్యులు.. అభిమానులంతా ఆమె ధైర్యం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 06:17 PM IST
    Follow us on

    చిరంజీవి సర్జా-మేఘనా రాజ్ దంపతులు శాండిల్ వుడ్లో బెస్ట్ కపుల్. వీరిద్దరు పదేళ్లకుపైగా ప్రేమించుకొని మూడేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. మేఘానా రాజ్ గర్భవతిగా ఉన్న సమయంలో చిరంజీవి సర్జా(36) గుండెపోటుతో హఠన్మారణం చెందాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

    Also Read: పవన్ కోసం కథను ఫైనల్ చేసిన బండ్ల !

    36ఏళ్లకే చిరంజీవి సర్జా మృతిచెందాడంతో మేఘానా రాజ్ ఒంటరైంది. భర్తలేకపోవడంతో ఆమె కుంగిపోగా కుటుంబ సభ్యులు.. అభిమానులంతా ఆమె ధైర్యం చెప్పారు. దీంతో మేఘానా రాజ్ ఆ బాధ నుంచి కోలుకున్నారు. ఇటీవలే ఆమె సీమాంతం ఘనంగా జరిగింది. చిరంజీవి సర్జా కటౌట్ పక్కన పెట్టుకొని ఆమె సీమాంతం చేసుకున్నారు. ఈ ఫొటోలు ఇటీవల నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

    చిరంజీవి సర్జా తన కడుపున పుడుతాడని మేఘానా రాజ్ పలుసార్లు చెబుతూ వచ్చింది. చిరంజీవి సర్జా సోదరుడు హీరో ధృవ సర్జా సైతం తన అన్నయ్యే మళ్లీ పుడతాడంటూ ఇటీవల భావోద్వేగం చెందాడు. ఈక్రమంలోనే మేఘానా సర్జా తాజాగా మగబిడ్డకు జన్మించింది. దీంతో మేఘానా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: రాజశేఖర్ కూతురికి ధైర్యం చెప్పిన మెగాస్టార్.. ఎందుకంటే?

    సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదేరోజున మేఘానారాజ్-చిరంజీవి సర్జాకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇదేరోజున మేఘానా జూనియర్ చిరుకు జన్మినవ్వడం మిరాకిల్ గా మారింది. మేఘానా మగబిడ్డకు జన్మనివ్వడంతో పలువురు సెలబ్రెటీలంతా జూనియర్ చిరంజీవి వెల్ కమ్ అంటూ స్వాగతం పలుకుతున్నారు.